Site icon NTV Telugu

Patek Philippe Watch: 82 ఏళ్ల క్రితం తయారీ.. వేలంలో రూ.156 కోట్లకు అమ్ముడైన పటేక్ ఫిలిప్ వాచ్

Patek Philippe Watch

Patek Philippe Watch

అరుదైన వస్తువులు, పెయింటింగ్స్ వేలంలో కోట్ల రూపాయల ధరలు పలుకుతుంటాయి. ఇదే రీతిలో తాజాగా దశాబ్ధాల చరిత్ర కలిగిన పటేక్ ఫిలిప్ వాచ్ వేలంలో రికార్డ్ ధర పలికింది. 2016లో వేలం వేయబడిన పటెక్ ఫిలిప్ వాచ్ మరో రికార్డును సృష్టించింది. ఈ వాచ్ రూ. 156 కోట్లకు అమ్ముడైంది, ఇది కొత్త ప్రపంచ రికార్డు. 1943లో తయారు చేయబడిన ఈ వాచ్‌ను పోటెక్ ఫిలిప్ పెర్పెచువల్ క్యాలెండర్ రిఫరెన్స్ 1518 అని పిలుస్తారు. ఈ వారాంతంలో ఆ చేతి గడియారం మరింత ఎక్కువ ధరకు అమ్ముడయిందని వేలం సంస్థ ఫిలిప్స్ తెలిపింది.

Also Read:Toyota Hilux 2025: కొత్త టయోటా హిలక్స్ 2025 విడుదల.. మొదటి ఎలక్ట్రిక్ వెర్షన్ అందుబాటులోకి

సమాచారం ప్రకారం, ఆ గడియారం 14,190,000 స్విస్ ఫ్రాంక్‌లకు ($17.6 మిలియన్లు) అమ్ముడైంది. ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ఆ సమయంలో అది పొందిన 11 మిలియన్ ఫ్రాంక్‌లు లేదా $11 మిలియన్ల కంటే ఎక్కువ. ఈ గడియారం 1943లో తయారు అయ్యిందని, దీనిని పాకెట్ ఫిలిప్ పెర్పెచువల్ క్యాలెండర్ రిఫరెన్స్ 1518 అని పిలుస్తారని AFP వార్తా సంస్థ నివేదించింది. ఈ మోడల్ మొత్తం 280 గడియారాలు తయారు చేశారు. కానీ నాలుగు మాత్రమే స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించారు. మిగిలినవి బంగారంతో తయారు చేశారు.

Also Read:Foldable Phones: ఫోల్డబుల్ ఫోన్‌లు కొంటున్నారా?.. అడ్వాంటేజ్‌ కంటే డిసడ్వాంటేజ్‌లే ఎక్కువ!

బంగారంతో తయారు చేసిన ఇతర గడియారాల కంటే స్టీల్‌తో తయారు చేసిన గడియారానికే ఎక్కువ డిమాండ్ ఉందని చెబుతున్నారు. అందుకే ఈ గడియారం వేలంలో ప్రపంచంలోనే అత్యధిక, రికార్డు ధరకు అమ్ముడైంది. ఈ ఆదివారం వేలం వేసిన గడియారం స్టీల్‌తో తయారు చేసిన నాలుగు గడియారాలలో మొదటిదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ వారాంతంలో స్టీల్‌నెస్ స్టీల్ 1518 అమ్మకం ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత చారిత్రాత్మక చేతి గడియారాలలో ఒకటిగా దాని హోదాను పునరుద్ఘాటించిందని వేలం నిర్వాహకులు ఆదివారం తెలిపారు. వేలం కేవలం తొమ్మిది నిమిషాలు మాత్రమే పట్టిందని, ఐదుగురు బిడ్డర్లు పాల్గొన్నారని, చివరికి ఆ గడియారం టెలిఫోన్ బిడ్డర్‌కు అమ్ముడయిందని తెలుస్తోంది.

Exit mobile version