Site icon NTV Telugu

Patang : ఫ్రెండ్‌షిప్, లవ్ ఎంటర్‌టైనర్ ‘పతంగ్’ ట్రైలర్..!

Pathang Trailar

Pathang Trailar

టాలీవుడ్‌లో ఇటీవల మంచి బజ్ క్రియేట్ చేసిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పతంగ్’. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మేకర్స్ విడుదల చేసిన ఈ ట్రైలర్ నేటితరం యూత్‌ను లక్ష్యంగా చేసుకుని కట్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ రెండు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశారు? అనే ప్రశ్న ఆధారంగా కథాంశం ఆసక్తికరంగా సాగుతుంది. నిజానికి,

Also Read: Ustad Bhagat Singh : రికార్డుల మోత మోగిస్తున్న ‘దేఖ్‌లేంగే సాలా’..

ఈ చిత్ర కథా పాతదే అయినా, నేటితరం యూత్‌ను ఆకట్టుకునేలా దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి కొత్త ట్రీట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, ముఖ్యంగా మంచి ఫ్రెండ్‌షిప్, లవ్, ఎమోషన్స్‌తో పాటు ఆకట్టుకునే మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా నిలవనుంది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం, ఫీల్ గుడ్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, ట్రైలర్ గనక గమనిస్తే ఈ సినిమాలో పలువురు సీనియర్ నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించడంతో, కేవలం యువ ప్రేక్షకులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఈ చిత్రానికి అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ మద్దతుగా (బ్యాకప్‌) నిలవడం సినిమా స్థాయిని, ప్రేక్షకుల్లో ఉన్న బజ్‌ను మరింత పెంచింది. కాగా చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. యూత్‌ఫుల్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

Exit mobile version