NTV Telugu Site icon

Pataleshwar Mahadev Temple: శివుడికి చీపురు సమర్పించే ఆలయం గురించి విన్నారా.? ఆలా ఎందుకు చేస్తారంటే..

Pataleshwar Mahadev Temple

Pataleshwar Mahadev Temple

Pataleshwar Mahadev Temple: మనం ఎప్పుడయినా శివాలయానికి వెళ్ళినప్పుడు శివునికి పాలు, నీరు, బిల్వ పత్రం, ఇంకా అనేక పండ్లను సమర్పించడం చూసే ఉంటాము. అయితే వీటన్నింటితో పాటు భక్తులు చీపుర్లు సమర్పించి మహాదేవుని పూజించే శివాలయం ఉందని కూడా తెలుసా మీకు. అవును మీరు చదివింది, వింది నిజమే. శివుడికి చీపురు సంపర్పించడం ఏంటి అని అనుకుంటున్నారా.? మరి ఆ గుడి విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

Vinesh Phogat Verdict: సినిమాల్లోని కోర్టు సన్నివేశాలు గుర్తొస్తున్నాయి.. కాస్‌ తీరుపై పేలుతున్న జోకులు!

ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో పురాతన పాతాలేశ్వర్ శివాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారు. పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి చీపురు సమర్పించడం ద్వారా కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. చీపురు సమర్పించడం ద్వారా భగవంతుడు భోలేనాథ్ సంతోషిస్తాడని., అలా చేయడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు.

Vande Bharath Trains: 100 వందే భారత్ రైళ్ల ఆర్డర్‌ను రద్దు చేసిన రైల్వేశాఖ..

ఇక్కడ చీపురు సమర్పించే సంప్రదాయం కూడా చాలా పాతది. శివునికి చీపురు సమర్పించేందుకు ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలబడతారు. అంతేకాకుండా వందలాది మంది భక్తులు దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్‌ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని సేథ్‌ను కోరాడు. అప్పటి నుండి ఈ ఆలయం గురించి చర్మవ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ చీపురు సమర్పించాలని చెబుతారు. దీంతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. అందుకే నేటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకుంటారు.

Show comments