Site icon NTV Telugu

Pat Cummins: ఇండియాలో పర్యటనకు ముందు ఆసీస్కు షాక్..!

Pat

Pat

భారత్ లో పర్యటనకు ముందు ఆసీస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ కోసం ప్రపంచ దేశాలు తమ సత్తా చాటేందుకు ప్రయత్నాల్లో లీనమయ్యారు. అయితే వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. వరల్డ్ కప్ కు ముందు ఆసీస్ జట్టు. ఇండియాలో పర్యటించనుంది. అందులో భాగంగా ఆసీస్ 3 వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే.. ఈ సిరీస్ లో ఆసీస్ కెప్టెన్, ప్రధాన పేసర్ పాట్రిక్ కమిన్స్ దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో 45 శాతానికి డీఏ పెంపు!

యాషెస్ సిరీస్ లో భాగంగా.. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కమిన్స్ మణికట్టుకు గాయమైంది. అయినప్పటికీ కమిన్స్ గాయంతోనే సిరీస్ ఆడాడు. దానివల్ల అతనికి నొప్పి ఎక్కువ కావడంతో.. కీలకమైన వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని, భారత్ లో జరిగే వన్డే సిరీస్ కు కమిన్స్ కు విశ్రాంతినివ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది. అయితే ఆసీస్ జట్టుకు కమిన్స్ స్థానంలో యువ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఆసీస్ జట్టు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా భారత్ లోనే ఉండనుంది. టీమిండియాతో ఆసీస్ 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది. అయితే ఇప్పటికే యాషెస్ సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా.. వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

Exit mobile version