Site icon NTV Telugu

Late Train Grand WelCome: 9గంటలు లేటుగా వచ్చిన రైలుకు గ్రాండ్ గా వెల్కమ్

Late Train

Late Train

Late Train Grand WelCome:
రైలు బండి రైలు బండి
వేళ కంటు రాదూ లేండి
దీన్ని కానీ నమ్ముకుంటే
ఇంతేనండి ఇంతేనండి అంటూ.. అప్పట్లో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో ఓ పాట ఉంది గుర్తుందా.. సరిగ్గా ఈ పాట లిరిక్స్ లాగే ఓ రైలుబండి కోసం ప్రయాణికులు తొమ్మిదిగంటలపాటు ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూశారు. ఎంతకీ రాకపోవడంతో కొంతమంది తమ ప్రయాణాన్ని విరమించుకుని ఇళ్ల బాట పట్టారు. కానీ అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అక్కడే ఉండిపోయారు. రావాల్సిన టైంకంటే 9గంటల తర్వాత ట్రైన్ రావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఆనందంతో డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. స్టేషన్లోకి వస్తున్న ట్రైన్ ఎదురుగా నిల్చుని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : China Corona: చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆక్సీజన్ యంత్రాలకు భారీ డిమాండ్

ఇంతలోనే మళ్లీ వారి ఆనందం ఆవిరైపోయింది. మార్గమధ్యంలోని ఓ స్టేషన్‌లో రైలు ఇంజిన్‌లో లోపం తలెత్తింది. దాన్ని సరిచేసేందుకు సిబ్బంది నాలుగు గంటలపాటు కష్టపడ్డా లోపం సరికాకపోవడంతో చేసేదేం లేక కాలికి పని చెప్పారు. అదే రైలు పట్టాల వెంబడి నడుస్తూ ప్రయాణికులంతా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. మిణుకుమంటున్న ఆశతో కొందరు అదే రైలులో ఎదురుచూస్తూ కూర్చున్నారు. మహారాష్ట్రలోని గోండియా నుంచి చంద్రాపూర్‌లోని బల్లార్షాలో రైలు నిలిచిపోయింది. అంతకు 4 గంటల ముందు ఇదే రైలును గోండియా స్టేషన్‌లో చప్పట్లు కొట్టి మరీ ప్రయాణికులు స్వాగతించారు.

Exit mobile version