IRCTC: ట్రాన్స్‌పోర్ట్ పెరిగింది.. వేగం పెరుగుతోంది.. గమ్యస్థానాల మధ్య దూరం తగ్గిపోయినట్టే కనిపిస్తోంది.. కానీ, అనుకోని ప్రమాదాలు బాధితుల కుటుంబాలను చిందరవందర చేస్తున్నాయి.. దీంతో.. ప్రమాద బీమాపై అంతా దృష్టిపెడుతున్నారు.. తమకు ఏదైనా జరిగితే.. తమను నమ్ముకుని ఉన్నవారు ఇబ్బందుల్లో పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.. అయితే, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకోవాలంటే బీమా కోసం ప్రత్యేకంగా ఆప్షన్ ఎంచుకోవాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్‌లో బీమా సదుపాయాన్ని డిఫాల్ట్‌గా అందజేయనున్నట్టు పేర్కొంది.
Read Also: Rahul Gandhi: ముంబై వేదికగా విపక్ష కూటమి తదుపరి భేటీ.. బీజేపీపై రాహుల్ ఫైర్
IRCTC పోర్టల్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల బీమా కవరేజీ అందించబడుతుందని బీమా పరిశ్రమ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.. రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంచుకోవడం నుండి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఇప్పుడు ఈ పథకాన్ని ఎంపిక చేసుకునేలా మార్చింది. మరో మాటలో చెప్పాలంటే, IRCTC పోర్టల్‌లో తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల బీమా కవరేజీ అందించబడుతుంది.. బీమా రక్షణను కోరుకోని వారు తగిన బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా అది నిలిపివేయబడుతుంది.. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీకి ప్రీమియం కేవలం 0.35 పైసలు మాత్రమే చార్జ్ చేయనున్నారు. కాగా, IRCTC వెబ్‌సైట్ ద్వారా రోజుకు దాదాపు 15 లక్షల మందికి పైగా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు.