ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది విజయవాడ విమానాశ్రయం మిలియన్ మార్క్‌ను అందుకుంది. ఇంకా రెండు నెలలు ఉండటంతో ఈ సంఖ్యలో మరో మూడు లక్షల మంది పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. మరో వైపు ప్రయాణికుల రద్దీని పరిశీలిస్తే, విజయవాడ ఎయిర్‌పోర్ట్ ఈసారి ఆల్ టైం రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది.
READ MORE: Maha Kumbh Mela: కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణం.. 16,000 మొబైల్ నెంబర్లపై దర్యాప్తు..
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయం ప్రాముఖ్యత కూడా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టుల జాబితాలో 35వ స్థానాన్ని దక్కించుకుంది.రాజమండ్రి, వైజాగ్, తిరుపతి విమానాశ్రయాల నుంచి కూడా అదే స్థాయిలో ప్రయాణికుల పెరుగుతున్నారు. రాష్ట్ర విమానాశ్రయాల్లో రద్దీ పై మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు.
READ MORE: Thandel : నేడు తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్