Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కదులుతున్న రైలు బోగీలో ఒక ప్రయాణికుడు దీపం వెలిగించి, శంఖం ఊదుతూ పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఏసీ కోచ్‌లో పంచె కట్టుకుని, నుదుటిన విభూది ధరించిన ఒక వ్యక్తి తన పక్కనున్న చిన్న టేబుల్‌పై దేవుడి చిత్రపటం, పూలు ఉంచి నూనె దీపం వెలిగించి హారతి ఇస్తూ కనిపించాడు. రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అతను శంఖం ఊదుతూ పూజలు చేయడం ఆ వీడియోలో రికార్డయింది.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే, పూర్తిగా మూసి ఉన్న ఏసీ బోగీలో ఇలా మంట వెలిగించడం వల్ల పెను అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మతపరమైన విశ్వాసాలు వ్యక్తిగతమైనప్పటికీ, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా రైలులో దీపాలు వెలిగించడం అత్యంత బాధ్యతారహితమని పలువురు విమర్శిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని, కనీస పౌర స్పృహ లేకుండా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- YS Jagan: పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు..! జగన్ సంచలన ఆరోపణలు.. రీపోలింగ్‌కు డిమాండ్..
- OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
- OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?
- CM Revanth Reddy: అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తా.. బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ నిప్పులు..
ఓ పని చేయండి స్వామి.
నిన్న జ్వాలాతోరణం అంట.
సో మొత్తం వత్తుల దండ తెచ్చి ట్రైన్ కి అతికించి తోరణం అంటూ పెట్టండి 🙏
హారతులు, శంఖారావంలు ఇంట్లో, గుళ్ళలో, లేక ప్రార్థనకు కేటాయించిన స్థలాల్లో మంచిది కానీ, ఇలా ట్రైన్లు, ఫ్లైట్లలో చేస్తే మనతో ఉన్న అందరికి ప్రమాదం https://t.co/3Stl94fYmj— శిఖివాహన 🦚 #GodofWar 🦚 (@SNsharma95) November 26, 2026
ఈ ఘటనపై భారతీయ రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. వైరల్ వీడియో ఆధారంగా విచారణ జరిపేందుకు వీలుగా ప్రయాణ తేదీ, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను తమకు అందించాలని రైల్వే సేవా ఖాతా ద్వారా నెటిజన్లను కోరింది. రైళ్లలో మంటలు వెలిగించడం, మండే స్వభావం ఉన్న వస్తువులను తీసుకెళ్లడం వంటి భద్రతా ఉల్లంఘనలు జరిగితే ప్రయాణికులు వెంటనే ‘రైల్ మదద్’ పోర్టల్ ద్వారా గానీ, 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి గానీ ఫిర్యాదు చేయాలని రైల్వే అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
Nandi Awards Jury: ఏపీ సర్కార్ నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ!
-
YS Jagan: పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు..! జగన్ సంచలన ఆరోపణలు.. రీపోలింగ్‌కు డిమాండ్..
-
OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
-
Alias Rukmini: నాని పట్టుబట్టి మరీ నాకు సినిమా ఇప్పించాడు.. ‘అలీయాస్ రుక్మిణి’పై నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!