Site icon NTV Telugu

Viral Video: ఫ్లైట్ ఆసల్యమైందని సిబ్బంది కొట్టిన ప్రయాణికుడు..

Viral

Viral

ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం ఆలస్యానికి సంబంధించి ప్రకటన చేస్తుండగా పైలట్‌పై దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా గంటల ఆలస్యం తర్వాత ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల కారణంగా మునుపటి సిబ్బందిని భర్తీ చేసిన కొత్త పైలట్‌ను పసుపు రంగు హూడీ ధరించిన వ్యక్తి అకస్మాత్తుగా చివరి వరుస నుంచి పరిగెత్తడంతో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Shiva Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి

అయితే, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఫ్లైట్ సిబ్బందిపై దాడి చేయడం నో ఫ్లై లిస్ట్‌లో కూడా చేర్చాలి దారుణమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ ఒకరు వ్యాఖ్యనించగా.. @IndiGo6E నిత్యం వార్తల్లో నిలుస్తుంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక, ఈ సంఘటన ఏ విమానంలో జరిగిందనేది ఇంకా తెలియలేదు. ఈ మధ్య కాలంలో ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 110 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 79 విమానాలు రద్దు చేయబడ్డాయి.

Exit mobile version