నిత్యం ప్రయాణీకులతో బిజీ బిజీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ లో ఓ కోడి పుంజును కట్టి పడేశారు. బస్సుల్లో ప్రయాణీకులు ఉండాల్సిన చోట ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంతకీ ఈ కోడి ఎక్కడ నుండి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. అంతేకాదు దాని బాధ్యతలు ఆర్టీసీ యాంత్రాంగంపై పడడంతో బోను ఏర్పాటు చేసి దానా, నీటిని అందిస్తున్నారు. ఇంతకీ ఆ కోడి వివరాలేంటి… ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకుందాం…
వరంగల్ నుండి వేములవాడ రాజన్న క్షేత్రానికి ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఆర్టీసీ బస్సు కరీంనగర్ కు చేరుకోగానే సరిరికి అక్కడ ఓ బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టిన కోడిని గమనించిన ప్రయాణీకులు కండక్టర్ కు సమాచారం అందించారు. ఎవరి కంట పడకుండా ఓ ప్రయాణీకుడు ఓ బుట్టలో కోడిని ప్యాక్ చేసిన ప్రయాణీకుడు కోడి ఉన్న బ్యాగును బస్సులోనే మర్చిపోయాడు. దీంతో వెంటనే కండక్టర్ కరీంనగర్ బస్ స్టేషన్ లోని కంట్రోలర్ కు సమాచారం ఇచ్చి కోడిని వారికి అప్పగించారు. కంట్రోలర్ ఆ కోడిని తీసుకెళ్లి కరీంనగర్ 2 డిపో యంత్రాంగానికి అప్పగించగా… ఓ జాలిలో కోడిని ఉంచి దానికి దాణాతోపాటు నీటిని అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఏం ఆర్టీసీ బస్సులతో పాటు కోడి కూడా అక్కడ సేద తీరుతోందని కొందరు ప్రయాణీకులు కామెంట్ చేస్తున్నారు. ప్రయాణీకుడు దొరికితే అతనిపై నిబంధనల మేరకు జరిమాని విధించే అవకాశం ఉండేది. కానీ ఆ కోడికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో దాని ఆలనా పాలనా అంతా ఆర్టీసీ యంత్రాంగంపై పడింది.
