Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. సినిమాకు వస్తున్న ఆదరణతో చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Anil Ravipudi: నిర్మాతకు కారు.. నాకు విల్లా: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్!
సినిమా ప్రీమియర్స్ రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ సినిమా హౌస్ ఫుల్ షోలతో కొనసాగుతోంది. మెగాస్టార్ మ్యానరిజమ్, అనిల్ రావిపూడి టేకింగ్, విక్టరీ వెంకటేష్ కాంబో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ విజయాన్ని పంచుకోవడానికి చిత్ర యూనిట్ మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇకపోతే సినిమాలో చిరంజీవి, నయనతారలకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి, ఒక కొడుకు ఉన్నారు. అయితే ఇందులో అబ్బాయిగా ‘విక్కీ’ అనే పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఆ పాత్రలో నటించింది అబ్బాయి కాదు.. ‘ఊహ’ అనే అమ్మాయి అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
ఈ పాత్ర కోసం ఊహ తన పొడవాటి జుట్టును కూడా కత్తిరించుకుని అబ్బాయిలా మారిపోయిందని డైరెక్టర్ అనిల్ చెప్పుకొచ్చాడు. సక్సెస్ మీట్‌లో యాంకర్ అమ్మాయిని ఏ పాత్ర చేశానని అడగ్గా.. ‘విక్కీ’ అని ఊహ సమాధానం ఇచ్చింది. దర్శకుడు అనిల్ ఆ అమ్మాయి డెడికేషన్ గురించి వివరిస్తుంటే ఊహ స్టేజ్ మీద భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత తేరుకున్న ఊహ.. చిరంజీవిని ‘చిరంజీవి మామ’ అని, అనిల్‌ను ‘డైరెక్టర్ మామ’ అని పిలుస్తూ ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడి అందరినీ మురిపించింది.
Fire Accident: గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
ఇక ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సందర్భంగా ఒక అరుదైన కోయిన్సిడెన్స్‌ను గుర్తుచేశారు. చిరంజీవి కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘పసివాడి ప్రాణం’ సినిమాలో కూడా పిల్లాడిగా నటించింది ఒక అమ్మాయి (సుజిత). మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ‘మన శంకర వరప్రసాద్’లో కూడా అలాంటి సంఘటనే జరగడం విశేషం. ఇది తాను ప్లాన్ చేసి చేయలేదని.. ఈ మధ్యే ఈ విషయాన్ని గమనించానని అనిల్ చెప్పుకొచ్చారు.
