Site icon NTV Telugu

Pasham Sunil Kumar: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!

Pasham Sunil Kumar

Pasham Sunil Kumar

Pasham Sunil Kumar: నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రయాణిస్తున్న కారు ముందున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. కావలి సమీపంలోని సున్నంబట్టి ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కారు బలంగా ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం తీవ్రతకు కారుకు ముందు భాగం దెబ్బతినింది.

LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన..

అయితే ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తో పాటు ఆయన సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ప్రమాదానికి గల కారణంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

Exit mobile version