ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఇటీవల విడుదల అయి విజయం సాధించిన సినిమాల గురించి తన అభిప్రాయం తెలియజేస్తూ వుంటారు. అలాగే పవర్ స్టార్ పవన కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బ్రో సినిమా గురించి తెలిసినపుడు అసలు దీంట్లో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఉండడమేంటీ అని నేను అనుకున్నాను. ఈ మూవీకి ఒక ఆర్టిస్ట్ అయిన సముద్ర ఖని డైరెక్టర్ చేయడం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే రాయడం వంటి విషయాలు తెలిసి నాకు ఆశ్చర్యంగా అనిపించింది అని ఆయన తెలియజేసారు.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సమాజంలో మార్పు రావాలనే ఆకాంక్ష నేను పవర్ కళ్యాణ్ లో చూసాను..సమాజం మారాలంటే..అధికారం సమర్థుల చేతులకి మారుతూ ఉండాలి..అది ఒక్కరి ఆధిపత్యంలోనే ఉండకూడదని ఆయన అన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా.. మళ్ళీ మన ముందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బ తిన్న పులిలా వస్తున్నారు. ఆయన తన పట్టుదల తో ఈసారి తాను అనుకున్నది సాధించి తీరుతారని పరుచూరి తెలియజేశారు.రాజకీయాలలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి.వాటిని లెక్క చేయకుండా ముందు సాగిపోవాలి.సమాజం గురించి ఒక రాజకీయ నాయుడు చెపితే వినేవాళ్ల కంటే సినిమా వాళ్లు చెపితేనే వినేవారు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలియజేశారు.. పవన్ కళ్యాణ్ అంటే తనకు మొదటి నుంచీ ఎంతో ఇష్టమని అన్నారు. సమాజం కోసం తపన పడే పవన్ కళ్యాణ్ బాగుండాలి అని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను అని తెలిపారు. రాజకీయాల లో బిజీ గా వున్నా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం మానేయవద్దని ఆయన తెలిపారు.అప్పుడప్పుడు అయినా సినిమాలు చేయాలని ఆయన ఆకాంక్షిచారు.
