Parliament Session Record: 89 రోజులుగా ప్రోరోగ్ కాని పార్లమెంట్.. 2008 నాటి రికార్డు బద్దలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Session Record: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, సమావేశాలు అధికారికంగా ముగిసినట్లు (ప్రోరోగ్ అయినట్లు) ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. గత 89 రోజులుగా పార్లమెంట్ సెషన్స్ ప్రోరోగ్ కాకపోవడంతో ఇది పార్లమెంట్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 4 నుంచి 22 వరకు 15 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గతంలో కూడా పార్లమెంట్ ప్రోరోగ్ కాకుండా సుదీర్ఘకాలం కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. 2008లో నాటి యూపీఏ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు జూలై 21, 22 తేదీలలో లోక్‌సభ రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడగా.. 87 రోజుల తర్వాత అక్టోబర్ 17న తిరిగి సమావేశాలు నిర్వహించారు. తాజాగా వర్షాకాల సమావేశాలు ముగిసి ఇప్పటికే 88 రోజులు దాటడంతో 2008 నాటి 87 రోజుల రికార్డు తిరగరాయబడింది.
Also Read
- Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్.. సర్కార్ కొత్త చట్టం..!
- IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
- AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
- Govardhan Puja 2026: నేడే గోవర్ధన పూజ.. శుభ సమయం, పూజా విధానం, మంత్రాలు, హారతి వివరాలు ఇవే!
సాధారణంగా ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు సభలను నిరవధికంగా వాయిదా వేసిన రెండు మూడు రోజుల్లోనే సెషన్స్ ముగిసినట్లు రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేస్తుంటారు. కానీ ఈసారి ఆగస్టు 13న వాయిదా పడిన తర్వాత నేటివరకు ముగింపు ప్రకటన రాలేదు. అంటే, వర్షాకాల సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(2) కింద జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లోనే ఉన్నట్లు భావించాలి. దీనివల్ల రాష్ట్రపతి ప్రమేయం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు సభలను తిరిగి ప్రారంభించే అధికారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు ఉంటుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించుకునేందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ను ప్రోరోగ్ చేయలేదని ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా తేనున్న పునర్విభజన బిల్లు కోసం కేంద్రం త్వరలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్ సమావేశాల సమయంలో ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు సంఖ్యాబలం లేక ఆమోదం పొందలేదు. ఈ బిల్లు గనక ఆమోదం పొందితే లోక్‌సభలో సభ్యుల సంఖ్య 543 నుంచి ఏకంగా 850కి పెరిగే అవకాశం ఉంది.
పార్లమెంట్ ప్రోరోగ్‌పై ప్రకటన రాకపోవడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన మెజారిటీని సమకూర్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ జాప్యం చేస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 4 నుంచి 22 వరకు నిర్వహించే అంశంపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Parliament Session Record: 89 రోజులుగా ప్రోరోగ్ కాని పార్లమెంట్.. 2008 నాటి రికార్డు బద్దలు..!
-
Ram Charan: ‘చిరు లీక్స్’ లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
-
Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్.. సర్కార్ కొత్త చట్టం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
ట్రెండింగ్
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్