NTV Telugu Site icon

Parliament: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..

Parlament

Parlament

Parliament: రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి లోక్‌సభ సమావేశాల్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కానీ, కేంద్ర సంస్థల దుర్వినియోగం, నీట్‌, అగ్నిపథ్‌ లాంటి అంశాల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్ ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై నేడు పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో నిరసన తెలపాలని నిర్ణయించారు. అలాగే, నీట్‌ పేపర్ లీకేజీపై తొలి చర్చ జరపాలని విపక్ష ఇండీ కూటమి డిమాండ్‌ చేస్తుండటంతో దానికి అంగీకరించబోమని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also: Shatrughan Sinha: ఆసుపత్రిలో శత్రుఘ్న సిన్హా.. పరుగెత్తిన కొత్త పెళ్లి కూతురు సోనాక్షి!

అయితే, పార్లమెంట్ ప్రారంభమైన తొలి రోజు సమావేశాల్లో ప్రమాణస్వీకారంతోనే అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం స్టార్ట్ అయింది. ప్రమాణ స్వీకారం పూర్తైన వెంటనే, ఎన్డీయే ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజ్యాంగాన్ని రక్షించండి వర్సెస్ ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడంతో గొడవ ప్రారంభమైంది. ఇక, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్‌సభలో ఆసాన్ తీసుకొచ్చిన తీర్మానంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రసంగంలో ఎమర్జెన్సీ గురించి ప్రస్తవించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Read Also: Medigadda: మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం

ఇక, ప్రస్తుతం పార్లమెంట్ లో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. నీట్‌పై చర్చిద్దామని విపక్షాలు పట్టుబడుతుండగా.. ధన్యవాద తీర్మానంపై చర్చకు ముందు ఎలాంటి చర్చలు జరిపే సంప్రదాయం లేదని మోడీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. మంగళవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో చర్చకు ప్రధాని సమాధానం చెప్పాల్సి ఉంది. నేడు (సోమవారం) పార్లమెంట్ ప్రారంభానికి ముందు, ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌లోని పార్టీలు, ఎన్డీయే కూటమి ప్రభుత్వం వేర్వేరు సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ధన్యవాద తీర్మానంపై చర్చను అంగీకరించాలా లేదా నీట్ అంశంపై మొదటి చర్చించాలా అనే దానిపై విపక్షాలు నిర్ణయిస్తాయి.