Site icon NTV Telugu

Parliament Budget Session: లోక్‌సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్..

Parliament

Parliament

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే ప్రచురించని పుస్తకాన్ని పేర్కొంటూ, భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో వ్యాఖ్యానించడంతో సోమవారం వివాదం ప్రారంభమైంది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే, మంగళవారం లోక్‌సభలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Read Also: Italian Vegetable Soup: ఇంట్లోనే 8 రకాల కూరగాయలతో సూపర్ హెల్తీ సూప్.!

విపక్ష సభ్యులు సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేశారు. దీంతో 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీల్లో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరెన్ రెడ్డి, వెంకట్ రామన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. స్పీకర్ ఈ సంఘటనను ఖండించారు. పార్లమెంటరీ మర్యాదను ఉల్లంఘనగా అభివర్ణించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలాంటి చర్యల్ని సహించేది లేదని చెప్పారు. ఏప్రిల్ 2న ముగియనున్న బడ్జెట్ సమావేశాల వరకు వీరిపై సస్పెన్షన్ అమలులో ఉంటుంది.

ఈ సస్పెన్షన్‌పై ఎంపీ ప్రియాంకాగాంధీ స్పందించారు. 8 మంది ఎంపీల సస్పెన్షన్‌ను విమర్శించారు. దీనిని హాస్యాస్పదమని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ సభ్యుడికి మాట్లాడే హక్కు ఉండాలని, వారి ఆందోళనలు వినాలని ఆమె అన్నారు.

Exit mobile version