NTV Telugu Site icon

Indhuja Ravichandran: ఆ ముద్ర వేస్తారనే భయంతో అలా చేయడం లేదు!

Indhuja

Indhuja

మేయాదమాన్‌’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్‌ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఇందుజా రవిచంద్రన్. ప్రస్తుతం హరీష్‌ కళ్యాణ్‌కు జంటగా పార్కింగ్‌ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇందుజా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్‌ ఉంటుందని అలాగే తనకు నటించడంలోనే కిక్‌ కలుగుతుందని తెలిపింది. సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఇందుజాని అనుకోనని పాత్ర స్వభావాన్ని బట్టి మారడం తనకు కిక్‌ ఇస్తుందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

ఇక పార్కింగ్ సినిమాకి సంబంధించిన పలు విషయాలను కూడా ఈ సందర్భంగా ఇందుజా పంచుకున్నారు. పార్కింగ్‌ చిత్రంలో తాను టీచర్ గా నటిస్తున్నానని చెప్పింది. పార్కింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? వాటి ద్వారా జరిగే పరిణామాలు? తదితర అంశాలను బేస్ చేసుకొని ఈ సినిమా ఉంటుందని దాంొత పాటు పలు ఆసక్తికరమైన ఘటనలు ఈ చిత్రంలో ఉంటాయని తెలిపింది. అయితే ఈ సినిమాలో తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందని కొన్ని ఛాలెంజింగ్‌ సన్నివేశాల్లో నటించానని చెప్పింది.

Also read : Pawan Kalyan: రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు పవన్.. పోలీసులు పర్మిషన్ ఇచ్చేనా..?

హీరోయిన్ గా నటించాలనే ధ్యేయంతోనే ఈ రంగంలోకి వచ్చానని, అయితే ఆరంభంలో ఆఫర్లు రాక కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేశానని తెలిపింది. అయితే అలాగే వరుసగా అలాంటి పాత్రల్లోనే నటిస్తే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే ముద్ర వేస్తారని భావించి ప్రస్తుతం కథానాయిక పాత్రలకే పెద్దపీఠ వేస్తున్నట్లు పేర్కొంది. అయితే సినిమాల్లో్కి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న కొన్ని అవమానాలను కూడా ఇందుజా ఈ సందర్భంగా తెలిపింది. తాను తమిళ్‌ అమ్మాయినని చెప్పగా ఆరంభ దశలో కొంతమంది హేళనగా చూశారని… ఎందుకు అలా చూస్తున్నారో అప్పుడు అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయంటుంది ఈ చిన్నది. ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ రావడంతో ప్రేక్షకులు అన్ని చిత్రాలనూ చూస్తున్నారని చెప్పింది.మంచి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోనని చెప్పుకొచ్చింది ఇందుజా.

Show comments