NTV Telugu Site icon

Paritala Sunitha Comments On CM Jagan: జగన్ రెడ్డి కాదు.. ఆయన బటన్ రెడ్డి

Paritala Sunitha

Paritala Sunitha

Paritala Sunitha Comments On CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి పేరు జగన్ రెడ్డి కాదని ఆయన పేరు బటన్ రెడ్డి అని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. పరిటాల సునీత ‘రైతు కోసం’ పాదయాత్ర చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పేరూరు మండలం గరిమాకుల పల్లి గ్రామంలో తన పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర గరిమకులపల్లి నుంచి పేరూరు వరకు మొత్తం 18 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ పాదయాత్రకు భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ కేవలం బటన్ నొక్కడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, కేసులు పెట్టిన పాదయాత్ర ఆపేది లేదని స్పష్టం చేశారు. వర్షాలకు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు రూ.30 వేల నుంచి 50 వేల వరకు చెల్లించాలన్నారు.

Read Also: A Man Sudden death In Marriage : పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ వధువు మేనమామ మృతి.. షాక్‎లో కుటుంబం

అలాగే అందరికీ బీమా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీమా డబ్బుల్లో కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బటన్ నొక్కితే సరిపోదని జగన్ రెడ్డిని అందరూ బటన్ రెడ్డి అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి రైతుల సమస్యలపై ఆరాతీసి ప్రభుత్వానికి నివేదిస్తానని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోడానికి ప్రజల వద్దకు వెళ్తుంటే అనుమతి లేదని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గం నుండి పేరూరు వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అనేక మందికి ఫించన్లు తొలగించారని, చేనేత కార్మికులకు నేతన్న హస్తం కూడా ఇవ్వడం లేదని ఆమె వాపోయారు.