Paris Paralympics 2024: హైజంప్‌లో భారత్ కు 2 పతకాలు..
- పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ కు 2 పతకాలు..
- శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా
- మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాన్ని సాధించాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Paralympics 2024: సెప్టెంబర్ 3న (మంగళవారం) పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ ఒక రజత పతకాన్ని, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ గేమ్‌లో అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 1.94 మీటర్ల దూరంతో కొత్త పారాలింపిక్ రికార్డును కూడా సృష్టించాడు. ఇక ఈ ఈవెంట్ లో 32 ఏళ్ల శరద్ ఫైనల్ మ్యాచ్‌లో 1.88 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకం సాధించాడు. మరోవైపు మరియప్పన్ 1.85 మీటర్ల ఎత్తుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్‌కు కోపం.. ముప్పై మంది అధికారులకు ఉరి..
ఇకపోతే మరియప్పన్ వరుసగా 3 పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు, ఈ మరియప్పన్ రియో పారాలింపిక్స్ 2016లో బంగారు పతకాన్ని, టోక్యో పారాలింపిక్స్ లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇకపోతే పతకాలను సాధించిన శరద్ కు రెండేళ్ల వయసులో పోలియో సోకింది. మరియప్పన్ 5 సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో అతనిపై నుండి బస్సు దూసుకుపోయింది. దీని తర్వాత అతని కుడి కాలు వైకల్యం చెందింది. ఇక మంగళవారం ముగిసే సమయానికి భారత్ పతకాల సంఖ్య 20కి చేరుకుంది. పారాలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారిస్ పారాలింపిక్స్‌లో ఇద్దరు భారత క్రీడాకారులు ఒకేసారి పోడియం పైకి వచ్చి మెడల్స్ తీసుకోవడం ఇది నాలుగోసారి.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!