NTV Telugu Site icon

Paris Olympics 2024: ఒలింపిక్స్ రౌండప్.. 31/07/2024

Paris

Paris

ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా.. భారత ఆటగాళ్లు కొందరు సత్తా చాటుతుంటే.. మరికొందరు ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే భారత్ రెండు కాంస్య పతకాలు సాధించింది. మరి కొందరు ఆటగాళ్లు సెమీ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. బుధవారం జరిగిన ఒలింపిక్స్ రౌండప్ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇండియన్ బాక్సర్ అమిత్ పంగాళ్.. పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల 51కేజీ ప్రిలిమినరీస్ రౌండ్ ఆఫ్ 16లో జాంబియాకు చెందిన తన అపోనెంట్ పాట్రిక్ చిన్ఎంబా చేతిలో 1-4 తేడాతో ఓటమి పాలయ్యాడు. మొదటి నుంచి చిన్ఎంబా.. గేమ్ ను డామినేట్ చేశాడు. జడ్జెస్ కూడా అన్ని రౌండ్ లలో చిన్ఎంబాకే ఫేవర్ చేశారు. 2019 వరల్డ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ సొంతం చేసుకున్న అమిత్.. చిన్ఎంబా ఇంటెన్సిటీ ని ఎక్కడ కూడా మ్యాచ్ చేయలేకపోయాడు. ఇక ఆఖరి 3 నిమిషాల్లో ఇద్దరు బాక్సర్లు పంచులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కానీ జడ్జులందరూ చిన్ఎంబా నే విన్నర్ గా డిక్లేర్ చేసారు.

మరోపక్క మహిళల 57కేజీ ప్రిలిమినరీస్ రౌండ్ ఆఫ్ 32 లో భారత మహిళా బాక్సర్ జాస్మిన్ లంబోరియా కూడా ఓటమిపాలయ్యారు. 32 ఏళ్ళ ఫిలిప్పీన్స్ బాక్సర్ నెస్తి పెటేషియో చేతిలో ఓటమితో మెడల్ పై ఆమె ఛాన్సెస్ పూర్తిగా వదులుకున్నట్టే. ఇక్కడ కూడా మొదటి నుంచి పెటేషియో డామినేట్ చేసింది. మొదటి రౌండ్ లోనే ఫిలిప్పీన్స్ బాక్సర్ కు ఐదుగురు జడ్జిలు 10 పాయింట్స్ ఇచ్చేసారు. సెకండ్ రౌండ్ లో కూడా పెటేషియో ఆధిపత్యం కొనసాగించింది. ఆ రౌండ్ లో కూడా ఐదుగురు జడ్జ్ లు ఆమెకే 10 పాయింట్స్ ఇచ్చారు. ఇక జాస్మిన్ కంబ్యాక్ ఇవ్వాల్సిన చివరి రౌండ్ లో కూడా ఆమె ఎటువంటి ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఓటమి పాలైంది జాస్మిన్ లంబోరియా.

ఇక ఆర్చరీ విషయానికి వస్తే.. 10 స్కోర్ చేసి కూడా ఓటమి చూశాడు ఇండియన్ ప్రామిసింగ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర. ఎంత ప్రతిభ ఉన్నా ఒక్కో సారి కొన్ని పరిస్థితులకు తలవంచాల్సిందే. ధీరజ్ కు కూడా అదే జరిగింది. ఆర్చరీలో బెస్ట్ స్కోర్ 10. కానీ ఆ 10 పాయింట్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా ధీరజ్.. ఇండివిజువల్ ఆర్చరీ ఈవెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కెనడాకు చెందిన ఎరిక్ పీటర్స్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో ఒకరిని మించి మరొకరు ప్రదర్శన చూపారు. వరుసగా 6 సార్లు ధీరజ్ 10 పాయింట్స్ సొంతం చేసుకోగా.. ఎరిక్ కూడా వరుసగా 6 సార్లు 10 పాయింట్స్ సాధించాడు. బేసిక్ గా ఆర్చెరీలో గేమ్ టై అయితే “సింగిల్ యారో ఘాట్ ఆఫ్” తో విన్నర్ ను డిసైడ్ చేస్తారు. ఈ షూట్ ఆఫ్ లో ధీరజ్ 10 పాయింట్స్ స్కోర్ చేశాడు. అందరూ విజయం ధీరజ్ దే అనుకున్నారు. కానీ షూట్ ఆఫ్ లో ఇద్దరూ 10పాయింట్స్ స్కోర్ చేస్తే.. రెండు యారోస్ లో సెంటర్ కి ఎవరి యారో దగ్గరగా ఉంటే వారినే విన్నర్ గా డిక్లేర్ చేస్తారు. అయితే ధీరజ్ వేసిన యారో.. ఎరిక్ యారో కంటే 2.4 సెంటీమీటర్స్.. సెంటర్‎కి దూరంగా ఉండటంతో గెలుపు ఎరిక్ పీటర్స్ సొంతమైంది. 10 పాయింట్స్ సొంతం చేసుకున్నా ధీరజ్ ఎలిమినేట్ అయ్యాడు.

భారత్ కు మెడల్ తీసుకురావాలని ప్రీతి పవార్ పెట్టుకున్న ఆశలపై నీరు చల్లింది కొలంబియా బాక్సర్ కాస్టానెడా. మొదటి రౌండ్ లో కొలంబియాన్ బాక్సర్ కాస్టానెడా డామినేట్ చేసింది. దీంతో నలుగురు జడ్జులు ఆమెకు 10 పాయింట్స్ పాయింట్స్ ఇచ్చారు. ఇక రెండవ రౌండ్ లో పుంజుకున్న ప్రీతి మూడు 10 పాయింట్స్ సాధించింది. ఇక హోరా హోరీగా జరిగిన ఆఖరి రౌండ్ లో విజయం కాస్టానెడానే వరించింది. నెక్ టు నెక్ జరిగిన ఈ మ్యాచ్ లో 2-3 తో కాస్టానెడా విజయం సొంతం చేసుకోగా.. ప్రీతి ఓడిపోయింది.

ఇక బాడ్మింటన్ విషయానికి వస్తే ఉమెన్స్ సింగిల్స్ గ్రూప్ ప్లే స్టేజిలో ఎస్టోనియన్ ప్లేయర్ క్రిష్టిన్ కూబాతో తలపడింది ఇండియన్ స్టార్ పీవీ సింధు. ఈ ఇద్దరూ తలపడటం ఇదే తొలి సారి. అయితే ఏ స్టేజిలో కూడా క్రిష్టిన్.. సింధుకి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు స్పీడ్ ను అసలు తట్టుకోలేకపోయింది క్రిస్టీన్. గేమ్ స్టార్టింగ్ నుంచి సింధు తన డామినేషన్ చూపించి వరుస పాయింట్లను సొంతం చేసుకుంది. మొదటి సెట్ ను 21-14 తో సొంతం చేసుకున్న సింధు సెకండ్ రౌండ్ మొదట్లో కొద్దిగా తడబడింది. సెకండ్ రౌండ్ మొదట్లో సింధుకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసిన క్రిస్టీన్.. ఆ తరువాత సింధు ముందు నిలబడలేకపోయింది. ఈ సెట్ ను 21-10తో సింధు సొంతం చేసుకుని.. ఎస్టోనియన్ ప్లేయర్ క్రిష్టిన్ కూబాపై భారీ విజయాన్ని నమోదు చేసింది పీవీ సింధు.

మరో పక్క మెన్స్ సింగిల్స్ గ్రూప్ ప్లే స్టేజి లో ఇండోనేషియాన్ ప్లేయర్ జొనథన్ క్రిష్టితో తలపడ్డాడు ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్. హోరాహోరీగా జరిగిన ఈ గేమ్ మొదట్లో జొనథన్ క్రిష్టి డామినేట్ చేశాడు. అయితే ఆ తర్వాత లక్ష్య సేన్ అద్భుతమైన ఆటతో ముందంజలోకి వచ్చాడు. ఒకరిని మించిన ఆట మరొకరు ఆడి.. అభిమానుల్లో టెన్షన్ పుట్టించారు. అయితే లక్ష్య సేన్ మొదటి సెట్ ను 21-18 తో సొంతం చేసుకున్నాడు. మొదటి సెట్ లో డిస్‎అడ్వాంటేజ్ సైడ్ నుంచి ఆడి గెలిచిన లక్ష్య సేన్.. సెకండ్ సెట్ ను అడ్వాంటేజ్ సైడ్ నుంచి ఆడాడు. ఈ సెట్ మొదటి నుంచి తన ఆధిపత్యం కొనసాగించిన లక్ష్య సేన్ 21-18, 21-12 తో మ్యాచ్ ను తన వశం చేసుకున్నాడు. తన కంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జోనాథన్ క్రిస్టిని ఓడించి మరపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాడు లక్ష్య సేన్. ఇప్పటివరకు ఈ ఇద్దరూ హెడ్ టు హెడ్ 6 మ్యాచ్ లలో తలపడగా.. జొనథన్ 4 గేమ్స్ సొంతం చేసుకోగా.. లక్ష్య సేన్ 2 గేమ్ లలో గెలిచాడు.