Nita Ambani-IOC: మరోసారి ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ!

  • మరోసారి ఐఓసీ సభ్యురాలిగా నీతా
  • 2016 ఒలింపిక్స్‌ సందర్భంగా తొలిసారి
  • మరికొన్ని గంటల్లో పారిస్ 2024 ఒలింపిక్స్
Nita Ambani Ioc

Nita Ambani Ioc

Nita Ambani Re-Elected as the IOC from India: అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా ముఖేష్ అంబానీ మరోసారి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఐఓసీ 142వ సెషన్‌ సందర్భంగా 100 శాతం ఓట్లతో నీతాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2016 ఒలింపిక్స్‌ సందర్భంగా నీతా అంబానీ తొలిసారి ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మరికొన్ని గంటల్లో పారిస్ 2024 ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి.

ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికైన నీతా అంబానీ మాట్లాడుతూ… ‘ఐఓసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నిక కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకముంచిన అధ్యక్షుడు థామస్‌ బాక్, ఐఓసీలో నా సహచరులందరికీ ధన్యవాదాలు. ఇది కేవలం నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశం ప్రభావం పెరుగుందని గుర్తించడం కూడా. ఈ సంతోషం, గర్వాన్ని నేను ప్రతి భారతీయుడితో పంచుకుంటున్నాను. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి’ అని అన్నారు.