NTV Telugu Site icon

Paris Olympics 2024: ఒలింపిక్స్ ఆరంభానికి ముందు షాక్.. ఐదుగురికి కరోనా!

Paris Olympics 2024

Paris Olympics 2024

Coronavirus in Paris Olympics 2024: విశ్వ క్రీడా సంబరం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. పారిస్ నగరంలో పారే సెన్ నదిపై ఆరంభం వేడుకులు జరగనున్నాయి. అయితే ఒలింపిక్స్ ఆరంభానికి ముందు ఓ షాకింగ్ న్యూస్. ఐదుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ కరోనా బారిన పడ్డారు.

వాటర్ పోలో మహిళల జట్టులోని ఐదుగురు క్రీడాకారిణులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఒలింపిక్ టీమ్ చీఫ్ అన్నా మీరెస్ ధ్రువీకరించారు. మంగళవారం ఇద్దరు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా.. బుధవారం మరో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. జట్టులోని మిగిలిన వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారని అన్నా తెలిపారు. కరోనా బారిన పడిన ఆ ఐదుగురు బాగానే ఉన్నారని, ప్లేయర్స్ అందరినీ పర్యవేక్షిస్తున్నామని చెప్ప్పారు. షెడ్యూల్ ప్రకారం శిక్షణను కొనసాగుతుందని, కరోనా బారిన వాళ్లు కూడా పోటీల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు.

Also Read: Anasuya Bharadwaj: మీకు అది చేతకాదు.. దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!

కరోనా వైరస్ కూడా ఇతర శ్వాసకోస సంబంధిత అనారోగ్యం వంటిదే అని, పెద్ద ముప్పుగా భావించాల్సిన అవసరం లేదని ఒలింపిక్స్ అధికారులు పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం క్రీడా గ్రామంలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, క్రీడాకారులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. పారిస్ ఒలింపిక్ క్రీడలలో వాటర్ పోలో పోటీలు జూలై 27- నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి.