NTV Telugu Site icon

Sarabjot Singh-Job: నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు: సరబ్‌జ్యోత్‌

Sarabjot Singh

Sarabjot Singh

Sarabjot Singh Rejects Govt Job: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో దక్షిణ కొరియాతో పోటీపడి పతకాన్ని గెలుచుకుంది. ఇటీవల భారత్ వచ్చిన సరబ్‌జోత్‌, మనులు.. చండీగఢ్‌లో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీని కలిశారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలను హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సరబ్‌జ్యోత్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించాడు.

Also Read: Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు నేడు ముగింపు.. భారత పతాకధారులుగా మను, శ్రీజేష్‌!

క్రీడా శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ హోదా ఇస్తామంటూ హర్యానా ప్రభుత్వం ప్రకటించగా.. తనకు ఉద్యోగం వద్దని సరబ్‌జోత్‌ సింగ్‌ అన్నాడు. ‘హర్యానా ప్రభుత్వం నాకు ఇచ్చింది మంచి ఉద్యోగమే. కానీ ఇప్పుడు వద్దు. షూటింగ్‌పై మరింత దృష్టి సారించాలని అనుకుంటున్నా. మంచి ఉద్యోగం చూసుకోమని నా కుటుంబం కూడా అడుగుతోంది. అయితే నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లలేను. ఇప్పుడు నేను ఉద్యోగం చేయలేను’ అని సరబ్‌జ్యోత్‌ అన్నాడు.

Show comments