Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని అధికారులు వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే పరిశ్రమలో జరిగిన పేలుడు లేదా సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఈ ఘటనతో ఫార్మాసిటీ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!