Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జామ్మూ కాశ్మీర్ జట్టు కెప్టెన్, సీనియర్ బ్యాటర్ పరాస్ డోగ్రా భారత దేశవాళీ క్రికెట్లో అరుదైన ఘనత సాధించారు. రంజీ ట్రోఫీ చరిత్రలో 150 మ్యాచ్‌లు ఆడిన రెండవ క్రికెటర్‌గా ఆయన నిలిచారు. వడోదరాలోని రిలయన్స్ స్టేడియంలో బరోడాతో జరుగుతున్న మ్యాచ్ ద్వారా ఆయన ఈ ఘనతను అందుకున్నారు. ఇప్పటివరకు భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రమే అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రికార్డును తన పేరిట కలిగి ఉండగా, ఇప్పుడు డోగ్రా ఆయన సరసన చేరి ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
మిడ్ 2000ల నుంచి భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన రన్ మెషిన్‌గా పరాస్ డోగ్రా గుర్తింపు పొందారు. ఎలాంటి ప్రచారానికి తావులేకుండా రంజీ ట్రోఫీలోని దిగువ శ్రేణి జట్లకు ఆడుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 2012-13 సీజన్లో హిమాచల్ ప్రదేశ్ తరఫున 8 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు బాది సంచలనం సృష్టించారు. ఇందులో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు ఉండటం విశేషం. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో ఆయన 2013లో వెస్టిండీస్ ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇండియా ఏ జట్టుకు ఎంపికయ్యారు. అయితే ఆయనకు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం రాగా, కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నికితా మిల్లర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యారు.
Also Read
- Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
- CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
- Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
- Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
A major milestone unlocked 🔓
Congratulations to Paras Dogra on becoming 𝙤𝙣𝙡𝙮 𝙩𝙝𝙚 𝙨𝙚𝙘𝙤𝙣𝙙 𝙥𝙡𝙖𝙮𝙚𝙧 to compete in 1⃣5⃣0⃣ #RanjiTrophy matches, after Wasim Jaffer 🫡
@mflone_ https://t.co/LTfvjajBCs
— BCCI Domestic (@BCCIdomestic) October 26, 2026
ఆ తర్వాత కూడా డోగ్రా తన పరుగుల వేటను కొనసాగించారు. 2015-16 సీజన్లో త్రిపుర, సర్వీసెస్ జట్లపై వరుస ఇన్నింగ్స్‌ల్లో తన కెరీర్లో 6వ, 7వ డబుల్ సెంచరీలను నమోదు చేశారు. ఆ సీజన్‌ను ఆయన 78.11 సగటుతో 703 పరుగులు చేసి ముగించారు. రెడ్ బాల్ క్రికెట్లో అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనూ ఆయనకు అవకాశాలు వచ్చాయి. 2010 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి గరిష్టంగా 41 పరుగులు చేశారు. 2012లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున 3 మ్యాచ్‌లు, 2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఒక మ్యాచ్ ఆడారు. 2016 ఐపీఎల్ వేలంలో గుజరాత్ లయన్స్ ఆయనను 10 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!