NTV Telugu Site icon

Parampara Restaurant: కూకట్‌పల్లిలో మరో ‘పరంపర’ రెస్టారెంట్‌.. రేపే ప్రారంభం

Parampara

Parampara

Parampara Restaurant: అద్భుత రుచుల అడ్డాగా మారిన పరంపర రెస్టారెంట్‌.. హైదరాబాద్‌లో ఎక్కడికి వెళ్లినా.. తమ రెస్టారెంట్లు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్‌ చేస్తూ ముందుకు సాగుతోంది. ఇష్టమైన ఆహారం కోసం.. మెచ్చిన రెస్టారెంట్‌కు వెళ్తుంటారు భోజన ప్రియులు.. మరికొందరు నచ్చిన రెస్టారెంట్‌ నుంచి మెచ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తుంటారు. ఇక వెజ్‌ ఫుడ్‌ ప్రియులు.. ప్రత్యేకంగా వెజ్‌ రెస్టారెంట్లకు మాత్రమే వెళ్తుంటారు.. ఆ కోవలోకే చెందింది పరంపర.. ప్యూర్ వెజ్‌ రెస్టారెంట్లతో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది పరంపర.. ఇప్పటికే హైదరాబాద్‌ వాసులకు పలు ప్రాంతాల్లో పరంపర రెస్టారెంట్లు అందుబాటులోకి తెచ్చింది.. బంజారాహిల్స్‌, అబిడ్స్‌, కూకట్‌పల్లిలో ఇప్పటికే రెస్టారెంట్లు ప్రారంభించిన పరంపర.. ఇప్పుడు కూకట్‌పల్లిలో మరో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఈ నెల అనగా మార్చి 10వ తేదీన కూకట్‌పల్లిలోని అశోక్‌ వన్‌ మాల్‌లో ఈ కొత్త బ్రాంచ్‌ ఓపెన్‌ కానుంది. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని పరంపర రెస్టారెంట్స్‌ యాజమాన్యం వెల్లడించింది.