NTV Telugu Site icon

Jawan Firing: గుజరాత్ ఎన్నికల విధుల్లో సహోద్యోగులపై జవాన్ కాల్పులు.. ఇద్దరు మృతి

Poll Duty

Poll Duty

Jawan Firing: గుజరాత్‌లో డిసెంబర్‌లో జరగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్‌.. తన సహచర జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పోర్‌బందర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని తుక్డా గోసా గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల కోసం వచ్చిన జవాన్లు పోరుబందర్‌కు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుపాను పునరావాస కేంద్రంలో ఉంటున్నారు. శనివారం బస్సులో ప్రయాణిస్తుండగా.. జవాన్ల మధ్య ఏదో విషయంలో గొడవ తలెత్తింది. దీంతో ఓ జవాన్​ కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దారి తీసిన విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన ఇద్దరు జవాన్లలో, ఒకరికి పొట్టలో, మరొకరికి కాలికి పోరుబందర్ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి వారిని అధునాతన చికిత్స కోసం 150 కిలోమీటర్ల దూరంలోని జామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం వేళ ఘర్షణకు దిగిన సమయంలో పురుషులు విధుల్లో లేరని.. ఆ జవాన్‌ ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలిసిందని పోరుబందర్‌ జిల్లా కలెక్టర్‌ ఏఎం శర్మ తెలిపారు. వారు మణిపూర్‌కు చెందిన ఇండియా రిజర్వ్ బెటాలియన్‌లో భాగంగా ఉన్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సె్స్‌తో పాటు గుజరాత్‌లో నియమించబడ్డారని ఆయన వెల్లడించారు. పోలీసుల నివేదికలో నిందితుడిని కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్‌గా గుర్తించారు.

Students Fell ill: రెండు పాఠశాలల్లో 50 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఏం జరిగిందంటే?

జవాన్లు తోయిబా సింగ్, జితేంద్ర సింగ్‌లు మృతి చెందగా.. చోరాజిత్, రోహికానా అనే కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరంతా మణిపూర్‌కు చెందినవారు. పోరుబందర్ జిల్లాలో మొదటి దశలో డిసెంబర్ 1న, రెండో దశ డిసెంబర్ 5న, ఫలితాలు 8న జరగనున్నాయి.