Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- జూన్ 11న పరమ ఏకాదశి..
- విష్ణువు అనుగ్రహం కోసం ఈ తప్పులు అస్సలు చేయకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parama Ekadashi: హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ప్రతీ మూడేళ్లకు ఒకసారి వచ్చే ఏకాదశి ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు. దీనినే ‘‘పరమ ఏకాదశి’’గా పిలుస్తారు. జూన్ 11న ఈ మహత్తర గడియలు రాబోతున్నాయి. ఇది అధిక మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం వల్ల ఒక వ్యక్తి అనేక జన్మల పాపాల నుంచి విముక్తి అవుతాడనే నమ్మకం ఉంటతుంది. పేదరికం, ఆర్థిక నష్టాలు తొలిగిపోతాయని చెబుతుంటారు. ఈ ఏడాది జూన్ 11న పరమ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. అయితే, ఈ ఏకాదశి రోజున చాలా నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు చేసిన వ్రత ప్రయోజనాలు లభించవు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. పరమ ఏకాదశి వ్రతం ఆచరించే వ్యక్తికి ఈ జీవితంలో సుఖం లభించడమే కాకుండా మోక్షమార్గం కూడా లభిస్తుందని చెబుతారు. అయితే ఈ వ్రతం ఎంత ప్రాముఖ్యమైనదో, దాని నియమాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. ఒక చిన్న పొరపాటు కూడా వ్రతం యొక్క ప్రయోజనాలను తగ్గిస్తుందని అంటారు. అందువల్ల, విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులను
పరమ ఏకాదశి నాడు ఈ తప్పులు అసలే చేయకండి..
1) తులసి ఆకులను లేదా మరే ఇతర మొక్కను గానీ కోయవద్దు.
ఈ రోజున తులసి ఆకులను కోయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. పూజ కోసం తులసి ఆకులను ఒక రోజు ముందుగానే కోయడానికి ప్రయత్నించండి.
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
- Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
2) ఊడ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఇల్లు శుభ్రం చేసేటప్పుడు చీమలకు లేదా ఇతర చిన్న జీవులకు హాని కలగకుండా జాగ్రత్త వహించండి. ఈ రోజున అహింసను పాటించడం చాలా ముఖ్యం.
3) దశమి తిథి నుండి నియమాలను పాటించాలి.
ఉపవాసం పాటించేవారు ముందు రోజు, అంటే దశమి తిథి నుండే బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారానికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
4) ఉప్పును తినొద్దు.
ఏకాదశి రోజున సాధారణ ఉప్పు తినడం నిషేధంగా చెబుతారు. తప్పనిసరి అయితే, ఉప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు.
5) ఈ ఆహారాలను మానుకోండి:
ఈ రోజున అన్నం, పప్పులు, ముల్లంగి, వంకాయలను తినకూడదు. నియమాలు ప్రత్యేకంగా అన్నం తినవద్దని చెబుతున్నాయి.
6) తిట్టడం, చెడు విషయాలకు దూరంగా ఉండండి.
ఒకరి గురించి చెడుగా మాట్లాడటం లేదా మనసులో ప్రతికూల ఆలోచనలు తెచ్చుకోవడం ఉపవాసం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. తిట్టడం, కోపం, ద్వేషం వంటివి మానుకోండి.
7) పగటిపూట నిద్రపోవడం మానుకోండి.
ఉపవాసం పాటించేవారు పగటిపూట నిద్రపోవడం మానుకోవాలి. వీలైతే, రాత్రిపూట మేల్కొని దేవునికి స్తోత్రాలు పాడండి, ఇది ఉపవాస ప్రయోజనాలను మరింత పెంచుతుంది.
ఏం చేస్తే మంచింది..
భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవార్లను ప్రార్థించిండి. వీలైనంత ధ్యానం చేయండి. ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి రజోగుణాలు దరి చేరనివ్వద్దు. ఉపవాసం పాటించాలి. దానధర్మాలు చేస్తే మంచింది. బ్రహ్మణులకు పాదరక్షలు, ఇతర ఉపయోగకరమై వస్తువుల్ని దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
తాజావార్తలు
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!