పాణ్యం నియోజకవర్గం మొత్తం పసుపుయంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు భారీ ర్యాలీగా వచ్చి కదం తొక్కారు. తమ అభిమాన నేత చరితమ్మకు స్వాగతం పలుకుతూ.. ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఆమెను ఆశీర్వదించారు. పాణ్యంలో ఇవాళ జరిగిన గౌరు చరిత రెడ్డి నామినేషన్ ర్యాలీ టీడీపీ శ్రేణుల్లో కదనోత్సాహం రగిలించింది.
Read Also: Uttarpradesh : భర్తతో గొడవ.. పిల్లలతో సహా నదిలో దూకి తల్లి సామూహిక ఆత్మహత్య
ఇక, గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా పాణ్యం నియోజకవర్గం ప్రజల తరపున గౌరు చరిత రెడ్డి పోరాటం చేశారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామగ్రామానా తిరిగిన ఆమె సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తనను గెలిపిస్తే పాణ్యంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి, సంక్షేమ అభివృద్ధి నెలకొల్పుతానని చరిత రెడ్డి ప్రజల్లో నమ్మకం కలిగించారు.
Read Also: AP Elections 2024: చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ.. ఏం చేద్దాం..?
కాగా, గౌరు చరిత రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పాణ్యం నియోజకవర్గం నలుమూల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలిరావడంతో పసుపుమయంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భర్త, నందికొట్కూరు టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి, కుటుంబసభ్యులు, అభిమానులు, తోడుగా పాణ్యంలోని తన స్వగృహం నుంచి కర్నూలు జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమంలో దాదాపు 11 వేల మంది వరకు పాల్గొన్నట్లు తెలుస్తుంది. పాణ్యం ప్రజలు సైతం ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని చరిత రెడ్డిని ఆశీర్వదించారు. మొత్తంగా ఈసారి పాణ్యంలో మార్పు తథ్యమని.. గౌరు చరిత రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.