ఒక పారిశ్రామికవేత్త ముంబై విమానాశ్రయంలో ఒక ప్లేట్ పానీ పూరి యొక్క అధిక ధరపై తన ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ అంతటా వైరల్ గా మారింది. మామూలుగా మనం రోడ్డు పక్కల దొరికే పానీ పూరి బండి వద్ద ప్లేట్ పానీపూరీలకు 20 రూపాయల నుంచి 40 మధ్యలో చెల్లిస్తాము. అదే కాస్త రెస్టారెంట్ లోపల వెళితే 50 రూపాయల నుంచి వంద రూపాయలు వరకు ప్లేట్ పానిపురికి చెల్లిస్తాం. ఇక తాజాగా ఒక పారిశ్రామికవేత్త చెప్పిన దాని ప్రకారం ముంబై విమానాశ్రయ టెర్మినల్లోని ఒక దుకాణంలో ఒక ప్లేట్ రూ. 333 లకు విక్రయించబడుతోంది.
Also Read: Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై..
“CSIA ముంబై విమానాశ్రయంలో ఆహార దుకాణాలకు రియల్ ఎస్టేట్ ఖరీదైనది, కానీ ఇంత ఖరీదైనది నాకు తెలియదు” అని షుగర్ కాస్మెటిక్స్ సహ వ్యవస్థాపకుడు మరియు COO కౌశిక్ ముఖర్జీ తన సోషల్ మీడియా ఖాతాలో రాశారు. ముఖర్జీ మూడు పానీపూరీలను చూపించే ఫోటోను పంచుకున్నారు. పానీ పూరి, దహి పూరి, సెవ్ పూరి లు అందులో ఉండగా ఒక్కొక్క ప్లేట్ లో 8 మాత్రమే ఉన్నకాని, ఒక ప్లేట్ ధర రూ. 333 గా నిర్ణయించారు.
Also Read: Sundar C: తెలుగు సినిమాలపై ఖుష్బూ భర్త సంచలన ఆరోపణలు.
దింతో చాలా మంది ఈ పోస్ట్ పై స్పందించారు. ఇందులో భాగంగా అమీర్ ఖాన్ నటించిన “3 ఇడియట్స్” సినిమా నుండి ఓ సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ., “పన్నీర్ తో కుచ్ దినో బాద్ సోనార్ కి డుకాన్ పే మిలేగా ఇట్టి ఇట్టి తెలియో మెయిన్ (కొన్ని రోజుల్లో, పన్నీర్ చిన్న ప్యాకెట్లలో గోల్డ్ స్మిత్ వద్ద విక్రయించబడుతుంది) ” అని అన్నారు. గత సంవత్సరం, ముంబై విమానాశ్రయంలో ఉన్న ఒక రెస్టారెంట్ దాని ధరల సంబంధించి కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు సమోసా, ఒక కప్పు టీ, ఒక నీటి బాటిల్ కోసం రూ. 490 ఖర్చు చేసినట్లు ఒక జర్నలిస్ట్ వెల్లడించిన తరువాత ఆన్లైన్ చర్చ మరింతగా జరిగింది.