Haryana: జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. ప్లాన్ బీతో భర్తను ఎలా మాయం చేసిందంటే..!
- జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్
- ప్లాన్-బీతో భర్త హత్య
- మూడేళ్ల తర్వాత బయటపడ్డ బండారం
- నిందితులు జైలుకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్య ఆరోగ్యం గురించి ఆలోచించడమే అతడు చేసిన తప్పు. అర్థాంగి ఆరోగ్యంగా ఉండాలని.. జిమ్‌కు తీసుకెళ్తాడు. కానీ అదే అతని కొంపముంచింది. భర్తను సైడ్ చేసి జిమ్ ట్రైనర్‌తో స్నేహం మొదలుపెట్టింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ వ్యవహారం మొత్తానికి భర్త కంటిలో పడేసరికి నిత్యం ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంకేముంది ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. కానీ మొదటి ప్లాన్-ఏ సక్సెస్ కాలేదు. ఇంకేముంది ప్లాన్ బీ అమలు చేసింది. ఈసారి మాత్రం సక్సెస్ అయింది. కానీ పాపం పండి మూడేళ్ల తర్వాత ప్రియుడితో జల్సా చేస్తుండగా అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది. అసలేం జరిగింది.. భర్తను ఎలా చంపింది. క్రైమ్ సినిమాను తలపిస్తున్న ఈ స్టోరీ తెలియాలంటే.. ఈ వార్త చదవండి.
హర్యానాలోని పానిపట్‌కు చెందిన వ్యాపారవేత్త వినోద్ భరారా, నిధి భరారా భార్యాభర్తలు. ఇద్దరు అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నారు. అయితే నిధి.. జిమ్ కెళ్లడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా జిమ్ ట్రైనర్ సుమిత్‌తో ఎఫైర్ పెట్టుకుంది. అతడితో వివాహేతర సంబంధాన్ని సాగిస్తోంది. ఇది కాస్త భర్త కంటిలో పడేసరికి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వినోద్.. సుమిత్‌ను హెచ్చరించాడు. ఇక ప్రేమికులిద్దరూ పగ పెంచుకుని.. వినోద్ పీడ వదిలించుకోవాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం ప్లాన్-Aను అమలు చేశారు. సుమిత్‌కు తెలిసిన పంజాబ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్ దేవ్ సునర్‌తో రూ.10 లక్షల మర్డర్ ఒప్పందాన్ని చేసుకున్నారు. అంతే జనవరి 5, 2021న వినోద్ కారును ట్రక్కుతో ఢీకొట్టాడు. బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఈ కేసు నడుస్తుండగా.. డిసెంబర్ 15, 2021న వినోద్ ఇంటి దగ్గరే దేవ్ సునర్ తుపాకీతో కాల్చి చంపుతాడు. అక్కడికక్కడే వినోద్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే యాక్సిడెంట్ కేసులో సెటిల్‌మెంట్ చేసుకునేందుకు వెళ్తే.. ఒప్పుకోనందుకు కాల్చి చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇలా ఈ కేసు నడుస్తోంది. అయితే ఇంతలో ఓ పోలీస్ అధికారికి వచ్చిన వాట్సప్ సందేశం.. పోలీసులను తీవ్రంగా కదిలింపజేసింది.
Also Read
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్‌కు పాక్ మంత్రి వార్నింగ్!
వినోద్ సోదరుడు ప్రమోద్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. అతడు జిల్లా పోలీసు చీఫ్, ఐపీఎస్ అధికారి అజిత్ సింగ్ షెకావత్‌కు వాట్సాప్ సందేశం పంపించాడు. మర్డర్ కేసును మరోసారి పరిశీలించాల్సిందిగా పోలీసు అధికారిని అభ్యర్థించాడు. వినోద్‌కు అత్యంత సన్నిహితులు ఎవరో చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. అంతే సదరు అధికారి ఫైళ్లను నిశితంగా పరిశీలించగా.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లుగా భావించారు. ఇక అప్పటి నుంచి నిధిపై పోలీసులు నిఘా పెట్టారు. ఆమె జిమ్ ట్రైనర్ సుమిత్‌తో సన్నిహితంగా ఉండడాన్ని గమనించారు. ఇక సుమిత్.. ట్రక్కు డ్రైవర్ దేవ్ సునర్‌తో కలిసి తిరుగుతున్నట్లు గమనించారు. దీంతో వీళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా.. బండారం బయటపడింది. వినోద్‌ను భార్య నిధి, ప్రేమికుడు సుమిత్ చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. దీంతో నిందితుల్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.
ఇదిలా ఉంటే నిధి తన పిల్లల్ని.. విదేశాల్లో ఉన్న తన మామ దగ్గరకు పంపేసి.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. జల్సా కోసం బయటకు వెళ్లినప్పుడు నిందితుల ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఖర్చుల కోసం భర్త పేరు మీద ఉన్న బీమా డబ్బు విత్‌డ్రా చేసుకుని వాడుకుంది. హంతకుడికి రూ.10లక్షలు కూడా ఈ డబ్బులే ఇచ్చింది. మొత్తానికి మూడేళ్ల తర్వాత పాపం పండి జైలు పాలైంది.
తాజావార్తలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!