Site icon NTV Telugu

Palvai Harish : పోడు భూములు రణ రంగాన్ని సృష్టిస్తున్నాయి

Palvai Harish

Palvai Harish

పోడు భూములు రణ రంగాన్ని సృష్టిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొడు రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో కేసీఆర్ కుర్చీ వేసుకొని పొడు భూముల పట్టాలు పంచుతామని చెప్పి, పొడు రైతులను నిండా ముంచారన్నారు. పొడు రైతుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 30, 40 సంవత్సరాల నుంచి పొడు భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉన్న ఫలంగా భూములు గుంజుకుంటే రైతులు ఆగమవుతారని, పొడు రైతులపై ఫారెస్ట్ ఆఫీసర్ల దాష్టీకాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

 

ఫారెస్ట్ అధికారుల దాస్టికాలకు ప్రభుత్వం చెక్ పెట్టాలని, పొడు రైతులు సంఘటితం కావాలి, అధికారుల అరాచకాలను ఎదురుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పాల్వాయని ఆయన తెలిపారు. పొడు రైతులకు అన్యాయం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అవుతోందని పాల్వాయి హరీష్‌ అన్నారు. పొడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం, పొడు రైతులను సంఘటితం చేసి పోరాటానికి సిద్దంవుతామన్నారు. ప్రభుత్వం దుందుడుకు పోకడలు కాకుండా సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలని, ఉన్నఫళంగా భూములు లాక్కుంటే పొడు రైతులు జీవనాధారం కోల్పోతారన్నారు.

Exit mobile version