పల్నాడు జిల్లాలో కిరాతక ఘటన కలకలం రేపింది. నిద్రలో ఉన్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం జరిగింది. తీవ్ర గాయాలపాలైన వారిని తక్షణమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ భార్య మంగమ్మ ప్రాణాలు కోల్పోయింది. భర్త శ్రీను పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు.
Also Read: Rainfall Deficit: తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం.. వచ్చే వారం చాలా కీలకం!
ఈ దారుణ ఘటన నూజెండ్ల మండలం ఐనవోలులో చోటుచేసుకుంది. తనకు ఎవరితో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, ఇటీవల తన భార్య మంగమ్మకు మర్దలతో మాటామాటా జరిగింది కానీ.. అది పెద్ద గొడవగా తాను భావించలేదని శ్రీను వెల్లడించారు. ఇంత క్రూరంగా నిప్పంటించే స్థాయిలో శత్రుత్వం ఎవరిది? అని ఇప్పటికే ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యులు బాధితులకి న్యాయం చేయాలని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
