NTV Telugu Site icon

Pallavi Prashanth vs Police: పోలీసులుపై రైతు బిడ్డ ఓవర్ యాక్షన్.. ఫ్యాన్స్ ను చితక్కొట్టి పంపేశారు!

Pallavi Prashanth

Pallavi Prashanth

Pallavi Prashanth vs Police at Annapurna Studios: బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ఎట్టకేలకు విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. అమర దీప్ -పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కప్ కోసం పోటీ పడగా చివరికి పల్లవి ప్రశాంత్‌ కప్ కొట్టాడు. ఇక షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమ ఇంటికి వెళ్లే సమయంలో వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ముఖ్యంగా అమర్‌దీప్‌ తన భార్య, తల్లితో కారులో బయటకు రాగానే ప్రశాంత్‌ అభిమానులు దాడి చేసి కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు. అలాగే కొందరు గీతూ రాయల్‌, అశ్విని శ్రీ కారు అద్దాలు సైతం ధ్వంసం చేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అటువైపుగా వెళ్తున్న దాదాపు 6 బస్సుల అద్దాలపైన కూడా రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం కోసం కంటెస్టెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టగా అది ప్రశాంత్ తో వాగ్వాదానికి కారణం అయింది.

SeshExShruti :అడివిశేష్, శృతిహాసన్‌ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్..?

కప్ గెలిచిన ఆనందంలో ప్రశాంత్‌ రూఫ్‌ టాప్‌ కారులో నిలబడి ర్యాలీ చేయాలని అనుకున్నాడు. అయితే అతను అలా ర్యాలీ చేస్తే శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన పోలీసులు అతడిని బయటకు రావొద్దని పదే పదే చెబుతూ కారు ఆపకుండా ముందుకు పోనివ్వాలని హెచ్చరించారు. దీంతో ప్రశాంత్‌ అసహనానికి లోనయ్యి ‘అన్నా.. ఏందన్నా ఇది! ఒక రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు’ అని ఎప్పటి లాగే తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడాడు. ‘పోలీసులే ఇట్ల చేస్తే ఎలా అన్నా? ఒక రైతు బిడ్డ అన్నా, నా కోసం ఎంతమంది వచ్చిర్రన్నా..’ అంటూ బయటకు రానివ్వట్లేదని తల బాదుకుంటూ.. ఆ పోలీసులను వీడియో తీయమని కారులో ఉన్నవారికి ఆదేశాలు ఇవ్వడం కనిపిస్తోంది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా రైతుబిడ్డ అనే సింపతీతో సీజనే గెలిచి ఇంకా ఆ రైతు బిడ్డ ముసుగు తీయకుండా ఎందుకు దాన్నే పట్టుకుని వేలాడతావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వెనుక వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొందరు అభిమానులను కొట్టి పంపేశారు అని ఆ వీడియోలో ప్రశాంత్ కారులోని వ్యక్తులు చెప్పడం కనిపిస్తోంది.