NTV Telugu Site icon

Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం

Rakesh Sir

Rakesh Sir

Crime News: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్‌లో మైనర్ బాలికపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ 11 మంది హంతకుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మిగిలిన ఆరుగురి కోసం సత్పతి సీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో పాల్ఘర్‌లో కలకలం రేగింది. నిందితుల్లో ఎక్కువ మంది డ్రగ్స్‌ మత్తులో ఉన్నారని ప్రచారం జరగుతోంది. పాల్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో టీనేజీ బాలికపై 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం, శనివారం మధ్య రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పాల్ఘర్ జిల్లా రూరల్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇందులో నిందితులు బాలికను తొలుత సముద్ర తీరానికి తీసుకెళ్లి, ఆ తర్వాత బీచ్ గ్రామంలోని ఖాళీ బంగ్లాలో అత్యాచారం చేశారన్నారు. నిందితులపై సత్పతి పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది.

Read Also: Kolkata: మైనర్ బాలికపై కొడుకు అత్యాచారం.. సహకరించిన తల్లి..

బాధితురాలు తెలిపిన వివరాలు.. డిసెంబర్ 16 రాత్రి 8 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు తనపై లైంగిక దాడి చేశారని తెలిపింది. నిందితులు తనను మహీమ్ గ్రామంలోని ఖాళీగా ఉన్న బంగ్లాకు తీసుకెళ్లారని, అక్కడ వారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. తరువాత, వారు ఆమెను సముద్ర తీరానికి తీసుకెళ్లి, అక్కడ వారు మళ్లీ పొదల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. నిందితుల్లో చాలా మంది యువకులే. వీరంతా గార్డా (మత్తు పదార్ధం)కు బానిసలైన సంగతి కూడా తెలిసిందే. బాధిత మైనర్ బాలిక మాహిమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో సత్పతి సాగరి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కింద కేసు నమోదైంది. ఈ మేరకు పాల్ఘర్ పోలీసు సూపరింటెండెంట్ బాలాసాహెబ్ పాటిల్ వెల్లడించారు. నిందితులంతా మహిమ్, హనుమాన్‌పాడ, టెంబి, సఫాలే, వడ్రాయ్ ప్రాంతాలకు చెందిన వారే. పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనతో పాల్ఘర్‌లో కలకలం రేగింది.

Show comments