Palamuru – Rangareddy Project LIVE: తెలంగాణ ప్రజల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత కొల్లాపూర్ పట్టణ శివారులో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
Palamuru – Rangareddy Project LIVE: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. ప్రత్యక్షప్రసారం

Palamuru Rangareddy