Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పలమనేరులోని జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఓ జీవిత ఖైదీ తప్పించుకుపోవడం తీవ్ర కలకలం రేపింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సూరి (39) అనే ఖైదీ ఆదివారం ఉదయం అధికారుల కన్నుకప్పి పరారయ్యాడు. ఈ సంచలన ఘటనతో అటు జైళ్ల శాఖ అధికారులతో పాటు ఇటు స్థానిక పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
నిందితుడు సూరి గతంలో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ క్రమంలో అతను కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే.. జైలులో అతని సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న జైళ్ల శాఖ అధికారులు, పునరావాస చర్యల్లో భాగంగా పలమనేరులోని జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతల కోసం అతడిని అక్కడికి తరలించారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడానికి జైళ్ల శాఖ నడుపుతున్న పెట్రోల్ బంకుల్లో మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలకు పనులు కేటాయిస్తుంటారు. అదే నమ్మకంతో సూరిని కూడా అక్కడ పనిలో పెట్టారు.
Also Read
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
అయితే, ఆదివారం ఉదయం విధుల నిర్వహణలో ఉన్న సమయంలో సూరి చాకచక్యంగా అక్కడ నుంచి తప్పించుకున్నాడు. అతడు కనిపించకపోవడాన్ని గమనించిన తోటి ఖైదీలు వెంటనే స్పందించి జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన జైళ్ల శాఖ సూపరింటెండెంట్ యూనిస్ ఘటనపై స్థానిక పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఖైదీ సూరి పట్టుబడటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులు, బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా ఏర్పాటు చేశారు. నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే అధికారులకే షాక్ ఇస్తూ పరారవ్వడంపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!