Pakistani Bride Wears LED Light Gagra On Her Wedding: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. దానిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని చాలా మంది ఆశ పడుతూ ఉంటారు. ఆ రోజు ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రెస్ లు, జ్యూయలరీ, మేకప్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి ఒక్కటి చక్కగా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక డ్రెస్ ల విషయంలో మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది వరకు ఎవరు వేయని విధంగా తమ పెళ్లి బట్టలు ఉండాలని ఆశ పడుతూ ఉంటారు. అలాగే అనుకున్నాడు పాకిస్తాన్ కు చెందిన ఓ వరుడు. తనకు కాబోయే భార్య ఇది వరకు అందరూ వేసుకున్న డ్రెస్సులు లాంటివి కాకుండా భిన్నంగా వేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆమె డ్రెస్ ను ఎల్ఈడీ లైట్స్ తో అలంకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Also Read: XRISM: చంద్రునిపై మరో ప్రయోగం.. శుభాకాంక్షలు తెలిపిన ఇస్రో
దీనిని పెళ్లి కుమార్తె రెహబ్ మక్సూద్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘త్రో బ్యాక్ టూ మై మెహందీ 2023. నా డ్రెస్ ను సూపర్ డూపర్ నా భర్త డిజైన్ చేయించారు. పెళ్లికూతరు అక్కడ ఉన్న లైట్ తో పాటు బ్రైట్ గా వెలగాలని కోరుకున్నాడు. అయితే మొదట ఇది వేసుకుంటే నిన్ను చూసి అందరూ నవ్వుతారని చెప్పాను కానీ తరువాత నేను ఎంతో గర్వంతో దీనిని ధరించాను. ఎందుకంటే ఎవరు కూడా తనకు కాబోయే భార్య కోసం ఇంతలా ఆలోచించి కష్టపడరు’ అని క్యాప్షన్ జోడించారు.
ఇక ఈ వీడియో చూసిన వారు పెళ్లి కుమారుడిపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఎవరు కాబోయే భార్య కోసం నిజంగా ఇంతలా ఆలోచించరని కామెంట్స్ చేస్తున్నారు. అతని భార్య కావడం ఆమె లక్ అని మరికొందరు అంటున్నారు. మీరు ఎప్పటికీ ఇలాగే ప్రేమతో సంతోషంతో ఉండాలంటూ మరికొందరు అభిలాషిస్తున్నారు. మీ భర్త ఐడియా సూపర్ నిజంగానే మీరు ఎల్ఈడీ లైట్స్ డ్రెస్ లో మెరిసిపోతున్నారు. డ్రెస్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు.
