Site icon NTV Telugu

Pakistan: హిందూ బాలికలను బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారు..

Pak

Pak

సింధ్ ప్రావిన్స్‌లో తీవ్రమైన మానవ హక్కుల సంక్షోభంపై పాకిస్తాన్ హిందూ నాయకుడు, సెనేట్ సభ్యుడు దనేష్ కుమార్ పల్యాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజంలోని బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారన్నారు. పాకిస్థాన్ రాజ్యాంగం బలవంతపు మత మార్పిడిని అనుమతించదని, అలాగే ఖురాన్ కూడా అనుమతించలేదనే విషయాన్ని అతడు గుర్తు చేశారు.

Read Also: China Flood: భారీ వర్షాలతో ఇబ్బందుల్లో చైనా.. హైవే కూలి 36 మంది మృతి

ఇక, మైనారిటీ వర్గాల యువతులు, బాలికలకు రక్షణ లేకపోవడంపై ఐక్యరాజ్యసమితి నిపుణులు గత నెలలో నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన తర్వాత పాకిస్తాన్ హిందూ నాయకుడు, సెనేట్ సభ్యుడు దనేష్ కుమార్ పల్యాని వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది వ్యక్తులు మాతృభూమి పాకిస్తాన్‌ను పరువు తీశారని మండిపడ్డారు. క్రైస్తవ, హిందూ బాలికలు ముఖ్యంగా బలవంతపు మత మార్పిడి, అపహరణ, అక్రమ రవాణా, పిల్లల దుర్వినియోగం, బలవంతంగా వివాహం, లైంగిక హింసకు గురవుతున్నారని నిపుణులు సైతం ఆరోపించారు.

Read Also: Nitin Gadkari: నేడు ఏపీకి నితిన్‌ గడ్కరీ..

అయితే, బాలల హక్కులపై కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 14 ప్రకారం.. పిల్లల హక్కులను, ఒత్తిడి లేదా అనవసరమైన ప్రేరేపణ లేకుండా అన్ని పరిస్థితులలో మతం లేదా విశ్వాసాన్ని మార్చడం ద్వారా స్వేచ్ఛగా ఉండాలని ఐక్యరాజ్య సమితి నిపుణులు చెప్పారు. కాగా, ICCPRలోని ఆర్టికల్ 18కి సంబంధించి పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తు చేసుకుని, బలవంతపు మత మార్పిడిని నిషేధించాలి అని తెలిపింది.

Exit mobile version