Site icon NTV Telugu

Pahalgam Terror Attack: రోడ్లపై పాకిస్థాన్ జెండాలు అతికించిన వ్యక్తులు.. పోలీసులు ఏం చేశారంటే?

Uttarkhand1

Uttarkhand1

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి ప్రపంచాన్నే కుదిపేసింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. 26 మంది అమాయక జనాలు చనిపోడంతో సంతాపం ప్రకటిస్తు్న్నారు. పర్యటకులను కాల్చి చంపే ముందు.. ఉగ్రవాదులు వారి మతం గురించి అడిగారు. మానవాళికే సిగ్గుచేటు తెచ్చిన ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజాగా ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌ నగరం భగత్ సింగ్ చౌక్ సమీపంలోని రోడ్లపై నిరసన కారులు పాకిస్థాన్ జెండాలు, పోస్టర్లు అతికించారు.

READ MORE: CM MK Stalin: తమిళనాడులోకి మతతత్వం చొరబడదు, ఉగ్ర దాడులు జరగవు..

ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి రోడ్లపై అతికించిన పోస్టర్లు, జెండాలను తొలగించారు. ఇవి ఎవరు అతికించారనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. పాకిస్థాన్ పోస్టర్లు, జెండాలను రోడ్లపై అతికించిన తర్వాత.. సున్నితమైన ప్రాంతాల్లో హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. అయితే.. శత్రుదేశం పాకిస్థాన్ ఇంత క్రూరమైన దాడి చేసింది. అలాంటి దేశం జెండాలు రోడ్లపై అతికించి వాహనాలు, జనాలతో తొక్కిస్తే తప్పేంటని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

READ MORE: Ready to War: యుద్ధానికి సిద్ధమా..? ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవా..?

కాగా.. రెండ్రోజుల క్రితం కర్ణాటకలోని జగత్ సర్కిల్, అలంద్ నాకా, మార్కెట్ చౌక్, సాత్ గుంబజ్ సహా అనేక చోట్ల రోడ్లపై పాకిస్థాన్ జెండాలను అతికించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాకిస్థాన్ జెండాలను రోడ్ల మీద, టాయిలెట్ వాల్స్ కు కూడా అంటించారు. అయితే ఓ కూడలిలో పాక్ జెండాలను రోడ్డుపై అంటించడాన్ని ముస్లిం మహిళలు తీవ్రంగా ఖండిస్తూ పాక్ జెండాలను తీసి వారితో తీసుకెళ్లారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళలు శత్రుదేశం పాకిస్థాన్ జెండా పట్ల మక్కువ చూపించడాన్ని చాలా మంది భారతీయ పౌరులు తప్పుబట్టారు.

Exit mobile version