NTV Telugu Site icon

Death Penalty: దేవుడిని తిట్టిన యువకుడు.. మరణ శిక్ష వేసిన పాకిస్తాన్ కోర్టు

Death Penalty

Death Penalty

పాకిస్థాన్ లో నిత్యం అలజడితో ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. అక్కడ ముస్లింలదే రాజ్యం. అలాంటి దేశంలో వారి దేవుడిని విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకుంటారా.. ఆ దేవుడిని దూషించిన వారిని చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా పాకిస్థాన్ లో జరిగింది. దైవ దూషణ చేశాడని పాకిస్తాన్ లో ఓ వ్యక్తికి మరణ శిక్ష పడింది. దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు, దైవ దూషణ చేశాడనే ఆరోపణలపై ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్తాన్ కోర్టు శుక్రవారం మరణ శిక్ష విధించింది.

Also Read: Odisha Train Accident: హృదయ విదారకం.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బైడెన్‌ దిగ్భ్రాంతి

లాహోర్ కు 400 కిలో మీటర్ల దూరంలోని బహవల్ పూర్ లో ఇస్లామ్ కాలనీకి చెందిన 19 ఏళ్ల నౌమాన్ మసేహ దైవాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేశాడని, అతనిపై కేసు నమోదు చేసిన అధికారులు వాట్సాప్ ద్వారా అతడు పంపిన మెస్సేజ్ లను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టారు. బహవల్ పూర్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెల్లడించింది.

Also Read: Andrapradesh : కాకినాడలో రోడ్డు ప్రమాదం..గుడిలోకి దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు మృతి..

ఇలాంటి తీర్పులు చెప్పడం ఇదే తొలిసారి కాదు.. ఇంతుకు ముందు కూడా ఓ క్రిస్టియన్ మహిళ దైవ దైషణ చేసిన నేపథ్యంలో ఆమెకు సైతం ఊరి శిక్షను విధించారు. తరుచు ఇలాంటి ఘటనలు జరుగడంతో అక్కడ క్రైస్తవులు జీవించేందుకు జంకుతున్నారు. ఎవరైన దైవ దూషణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ అధికారులు హెచ్చరించారు.