India vs Pak: ఆసియన్ కప్ 2023లో భాగంగా.. మరికాసేపట్లో భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్-4 మ్యాచ్ ప్రారంభంకానుంది. కొలంబోలో జరుగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు టీమిండియా రెండు మార్పులతో మ్యాచ్ ఆడనుంది. పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. వెన్నుగాయంతో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ దూరంకాగా.. బ్యా్ట్స్ మెన్ కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. కొలంబోలో వాతావరణం ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రాత్రి 7 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగినా.. ఈ రోజు జరకపోయినా రిజర్వ్ డే అయిన రేపు ఆడిస్తారు.
Also Read: Lifestyle : ప్రపోజ్ చేసిన వెంటనే అమ్మాయిలు ఎందుకు ఒప్పుకోరో తెలుసా?
భారత్ తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ తుదిజట్టు: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్