Pakistan vs USA: “ఇదెక్కడి దిక్కు మాలిన బౌలింగ్ రా మావా?”.. పాక్ బౌలర్‌పై ట్రోలింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs USA: పాకిస్థాన్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. ఈ వివాదాల కారణంగా పాకిస్థాన్ నిరంతరం ట్రోలింగ్స్‌కు గురవుతుంది. అయితే.. ఫిబ్రవరి 10న జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో మరోసారి పాకిస్థాన్ ట్రోలింగ్‌కు గురైంది. నిన్న పాకిస్థాన్–అమెరికా మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్లు ఏకంగా 16 ఓవర్లు వేశారు. ఇది ఒక ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ వేసిన రెండో అత్యధిక స్పిన్ ఓవర్లుగా నిలిచింది. 2012లో ఆస్ట్రేలియాపై 18 ఓవర్లు స్పిన్ వేసిన రికార్డు ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ మరోసారి చర్చకు దారితీసింది. అతని యాక్షన్‌పై ఇంతకుముందే ఐసీసీ క్లియర్ ఇచ్చినప్పటికీ.. కొలంబోలో కొంతమంది అమెరికా అభిమానులు అతన్ని ఆటపట్టిస్తూ కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు కెమెరూన్ గ్రీన్ సైతం తారిక్‌ను ఔట్ అయిన తర్వాత ‘చకింగ్’ సంకేతం చూపిన విషయం తెలిసిందే. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ బౌలింగ్‌పై ప్రస్తుతం నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. “ఇదెక్కడి దిక్కుమాలిన బౌలింగ్ రా మావా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఉస్మాన్ కి సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌గా మారాయి.
READ MORE: Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఇకపై ఇలా చేయాల్సిందే!
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
మరోవైపు.. అదే మ్యాచ్‌లో అమెరికా జట్టులో శాడ్లీ వాన్ షాల్క్విక్ మరో రికార్డు సృష్టించాడు. 2024 నుంచి 2026 మధ్య ఆడిన 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి, టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సౌరభ్ నెట్రావల్కర్, హర్మీత్ సింగ్ ఇద్దరూ 7 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. షాల్క్విక్ ఈ వరల్డ్ కప్‌లో భారత్‌పై ముంబై వాంఖెడే స్టేడియంలో 4/25 గణాంకాలు నమోదు చేశాడు. అలాగే కొలంబోలో పాకిస్థాన్‌పై కూడా 4 వికెట్లు తీసి తన ప్రతిభను చాటాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా అతడే. మొత్తానికి ఫిబ్రవరి 10 మ్యాచ్‌లు రికార్డులు, అద్భుత ప్రదర్శనలు, వివాదాలతో అభిమానులను అలరించాయి.
READ MORE: Usman Tariq Bowling: వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు.. ఉస్మాన్ తారిక్‌పై సెహ్వాగ్ ఫైర్!
USA & Sri Lanka fans accused Usman Tariq of chucking in stadium🤣🤣🤣🤣
Whenever he plays, either player themselves or fans accuse him for chucking, he should be banned. Period!! pic.twitter.com/lxsWYPzABF
— Rajiv (@Rajiv1841) February 10, 2026
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!