Site icon NTV Telugu

Cease Fire Violation : శ్రీనగర్‌లో పాకిస్థాన్ డ్రోన్ దాడులు.. వీడియో షేర్ చేసిన ఒమర్ అబ్దుల్లా..

Jammu

Jammu

భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శ్రీనగర్ మీదుగా పెద్ద ఎత్తున డ్రోన్ కార్యకలాపాలు జరిగినట్లు సమాచారం. శ్రీనగర్‌లో జరిగిన డ్రోన్ దాడి వీడియోను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు. పాకిస్థాన్ భారీ షెల్లింగ్‌కు దిగిందని.. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు.”ఇది కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్ మధ్యలో ఉన్న వైమానిక రక్షణ విభాగాలు ఇప్పుడే తెరుచుకున్నాయి” అని సీఎం సోషల్ మీడియాలో పోస్ట్ లో రాసుకొచ్చారు.

READ MORE: TVS Ntorq 150: ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న టీవీఎస్ ఎన్టోర్క్..!

వీడియో విడుదల చేసే కంటే ముందు మరో ట్వీట్ చేశారు. “ఇప్పుడే కాల్పుల విరమణకు ఏమైంది? శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయి!!!” అని అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ఒప్పంద ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version