Site icon NTV Telugu

Pakistan: ఆత్మాహుతి దాడిలో చనిపోయిన చైనీయులకు సాయం.. 2.58 మిలియన్ డాలర్ల ప్రకటన

Jee

Jee

ఆత్మాహుతి దాడిలో మరణించిన 5 మంది చైనీయుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వాయువ్య పాకిస్థాన్‌లో ఆత్మాహుతి బాంబర్ తన పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు చైనా జాతీయులు, ఒక పాకిస్థానీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Hyderabad: కంచంలో కల్తీ.. ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్ల చెలగాటం..

దీంతో ఆ దాడిలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్లు చెల్లించాలని పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయించినట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. చైనా కాంట్రాక్టర్‌కు చెందిన ఐదుగురు చైనీస్ కార్మికులకు ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించనుందని శుక్రవారం మీడియా కథనాలు వెలువడ్డాయి.

ఐదుగురు చైనీయులు, పాకిస్థానీ డ్రైవర్‌ మార్చి 26న ఖైబర్-పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బిషామ్ ప్రాంతంలో దాసు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టడంతో మరణించారు.

చైనా పౌరుల కుటుంబాలకు తగిన మార్గాల ద్వారా చెల్లింపుల కోసం బీజింగ్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఖాతాకు ఈ మొత్తాన్ని వెంటనే బదిలీ చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే నెల ప్రారంభంలో బీజింగ్‌లో పర్యటించనున్నారు. పర్యటనకు ముందు ఈ పరిహారం ప్రకటన వెలువడింది. దాదాపు ఐదేళ్లుగా పాకిస్థాన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఇది కూడా చదవండి: Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం

Exit mobile version