Site icon NTV Telugu

Pakistani Drone Strike: పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడి.. భారీగా ఇళ్ళు, కార్లు ధ్వంసం!

Pak

Pak

Pakistani Drone Strike: పాకిస్తాన్ శుక్రవారం నాడు చీకటి పడగానే. భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది. ఇండియాలోని 26 ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఈ సందర్భంగా సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ టార్గెట్ గా పాక్ కాల్పులు జరిపింది. పౌరులు నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది పాకిస్తాన్.

Read Also: India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు మూసివేత..

ఇక, పాకిస్తాన్ దాడుల్లో సామాన్య ప్రజల ఇళ్ళు, వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ డ్రోన్ దాడిలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఒక నివాస ప్రాంతంలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా రెచ్చగొట్టే చర్యలను పాకిస్తాన్ దిగడంతో.. భారత దళాలు దాయాది దేశంలోని నాలుగు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.

Exit mobile version