Pak praising India:ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.ప్రజలు సాధారణ అవసరాలకు సంబంధించిన వస్తువులు కావాలి. పిండి, పప్పుల కోసం కూడా పాకిస్థానీ పౌరులు తహతహలాడే పరిస్థితి నెలకొంది. ప్రజల దగ్గర సరిపడా డబ్బు లేదు, ఆహారం దొరకడం లేదు. అయితే మరోవైపు భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానానికి చేరుకుంది.గ్లోబల్ వేదికపై పెరుగుతున్న భారత్ స్థాయికి పాకిస్థాన్ షాక్ ఇచ్చింది.పాకిస్థాన్ స్వయంగా భారత్‌పై ప్రశంసలు కురిపించింది. పాకిస్తాన్ వార్తాపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ మొదటిసారిగా ప్రపంచంలో భారతదేశం యొక్క ఔచిత్యాన్ని ప్రశంసించింది.
Read Also: North India – Cold: ఉత్తరాది ‘వణుకు’తోంది… ఎందుకో తెలుసా..?
పాకిస్తాన్ రాజకీయ,భద్రత, రక్షణ విశ్లేషకుడు షాజాద్ చౌదరి ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో తాను ఓ భారతదేశంలో పుస్తకం రాస్తున్నట్లు పేర్కొన్నారు.గతేడాది బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు.2037 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన రాశారు.కాబట్టి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచ దేశాలనుంచి వచ్చే విరాళాలతో మనుగడ సాగించాల్సి వస్తుందన్నారు.
భారతదేశం 600 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలను కలిగి ఉండడం పై షాజాద్ చౌదరి కూడా ప్రశంసించారు.600 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్ వద్ద కేవలం 4.5 బిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి.పాకిస్థాన్ 1971 నుంచి తీవ్ర సంక్షోభంలో ఉందని.. పాకిస్థాన్ రాజకీయ ఆర్థిక వ్యవస్థ పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందన్నారు. పాకిస్థాన్ అంతర్జాతీయ స్థాయి కూడా పడిపోయే పరిస్థితి నెలకొంది.
Read Also: Heart Disease: రోజుకు 6 వేల-9 వేల అడుగులు నడవండి.. గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోండి..
షాజాద్ చౌదరి భారతదేశ ఆర్థిక వ్యవస్థను చైనాతో పోల్చారు.ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.జిడిపిలో భారతదేశ వృద్ధి రేటు చైనా తర్వాత గత మూడు దశాబ్దాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థలతో సరిపోలుతుందని ఆయన అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 600 బిలియన్లకు పైగా పెరిగిందని ఆయన అన్నారు. భారతదేశం భారీ పురోగతి కలిగి ఉందని, అందుకే పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారని ఆయన అన్నారు.
రాజకీయ అస్థిరత, ఆర్థిక విధానాలు లేకపోవడం, తీవ్రవాద అవినీతి,వివిధ వనరుల కొరత కారణంగా విదేశీ పెట్టుబడిదారులందరూ పాకిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టకుండా తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.