Yogi Adityanath: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను సాధిస్తోందని, ప్రపంచం దేశం వైపు చూస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌశాంబి మహోత్సవ్‌ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌశాంబిలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ.. “భారత ప్రభుత్వం గత మూడేళ్లుగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తోందని, అయితే పాకిస్తాన్‌లో ప్రజలు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని, నేడు ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.” అని అన్నారు.
‘కౌశాంబి మహోత్సవ్’ ద్వారా ఈ ప్రాంత సంప్రదాయ విలువలకు అంతర్జాతీయ వేదికను కల్పించినందుకు కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలోని యువత క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యవంతంగా జీవించి దేశాభివృద్ధికి దోహదపడేలా స్ఫూర్తిని పొందుతోందని అన్నారు. “ఈరోజు రూ.612 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను హోం మంత్రి ప్రారంభించారు. కౌశాంబికి చాలా లోతైన చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఆనాటి 16 మహాజనపదాలలో ఇది ఒకటి. రాముడు కూడా ఒక రాత్రి తన సమయాన్ని ఇక్కడ గడిపాడని నమ్ముతారు.” అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
Read Also: Parents of Martyrs: అమరవీరుల తల్లిదండ్రులకు వీర్ మాతా, వీర్ పితా ఐ-కార్డులు
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి పథకాలు ప్రతి పల్లెకు, ప్రతి పేదవాడికి, రైతుకు, యువతకు తారతమ్యం లేకుండా చేరుతున్నాయన్నారు. “మా ప్రభుత్వం క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానం, ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రధాని మోడీ క్రమం తప్పకుండా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ అని చెబుతారు. ప్రతి పంచాయతీ, నగర్ నికే, జనపద్ దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవాలి. 2018లో కౌశాంబి మహోత్సవం సందర్భంగా నేను చూసిన అదే స్థాయి ఉత్సాహాన్ని ఈ రోజు నేను చూడగలుగుతున్నాను” అని ఆయన అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే 2025 కుంభమేళాకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని, అందుకు ప్రజలు, అధికారులు సహకరించి సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
