NTV Telugu Site icon

Champions Trophy 2025: ఎక్కడో చిన్న ఆశ సీనా.. పాకిస్థాన్‌ సెమీస్ చేరాలంటే సమీకరణాలు ఇలా!

Pakistan Team

Pakistan Team

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు వరుస షాకులు తగిలాయి. గ్రూప్‌-ఎలో ఉన్న పాక్.. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో భారత్‌ చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన దాయాది జట్టు.. సెమీస్ రేసులో చాలా వెనకబడి పోయింది. దాదాపుగా పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్లే. అయితే ఎక్కడో చిన్న ఆశ పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలను చూపిస్తోంది.

నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌తో పాకిస్థాన్ భవితవ్యం తేలనుంది. ఈరోజు న్యూజిలాండ్‌ గెలిస్తే.. గ్రూప్-ఎ నుంచి భారత్‌, కివీస్ జట్లు సెమీస్ దూసుకెళ్తాయి. అప్పుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ టీమ్స్ ఇంటిదారి పడతాయి. ఒకవేళ ఈరోజు న్యూజిలాండ్ ఓడితే.. పాక్, బంగ్లా జట్లు సెమీస్ రేసులో ఉంటాయి. అప్పుడు ఫిబ్రవరి 27న బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో పాక్‌ కచ్చితంగా గెలవాలి. అలానే మార్చి 2న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలి. ఇదంతా జరిగితే భారత్‌ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. పాక్, బంగ్లా, కివీస్ జట్లు రెండేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి. మెరుగైన నెట్‌ రన్‌రేట్ ఉన్న జట్టు నాకౌట్‌కు చేరుతుంది.

Also Read: Virat Kohli Record: ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!

పాక్‌ సెమీస్ సమీకరణాలు:
# ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌ను బంగ్లాదేశ్ ఓడించాలి
# ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ గెలవాలి
# మార్చి 2న న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించాలి
# పై సమీకరణలతో పాటు పాక్ మెరుగైన నెట్‌ రన్‌రేట్ సాదించాలి