Site icon NTV Telugu

Pakistan: ఆర్థిక సంక్షోభంతో అమెరికాలోని ఎంబసీ భవనాన్ని అమ్మేసిన పాకిస్తాన్

Pakisthan

Pakisthan

ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్‌లో తీవ్రస్థాయికి చేరుకుంది. చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల జీతాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక వాషింగ్టన్ లోని పాక్ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. ఈ క్రమంలో అమెరికాలోని అమ్మేందుకు పెట్టిన ఎంబసీ కార్యాలయం 7.1 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. వాషింగ్టన్ లోని పాకిస్తాన్ చారిత్రాత్మక భవనమైన ఎంబసీ బిల్డింగ్ ను 2003 నుంచి ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా ఉండటంతో 2018లో దౌత్య హోదాను కూడా కోల్పోయింది.

Read Also: Adipurush: ఇదెక్కడి విడ్డూరం.. చంద్రయాన్ 3 బడ్జెట్ కంటే ఆదిపురుష్ బడ్జెటే ఎక్కువంటనే..?

అయితే, ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థతో సహా పలు సంస్థలు పోటీపడగా చివరకు పాకిస్తాన్ కు చెందిన బిజినెస్ మెన్ హఫీజ్ ఖాన్ దీన్ని 7.1 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్‌కు వాషింగ్టన్‌లో రెండు చోట్ల ఎంబసీ ఆఫీసులు ఉన్నాయి. ఆర్‌ స్ట్రీట్‌లో ఉన్న ఈ బిల్డింగ్ ను 1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు కొనసాగాయి. క్రమేపీ అందులో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

Read Also: NITW : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. BSc–BEd డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం

డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఈ బిల్డింగ్ ను దుర్భర స్థితిలో ఉన్న ఆస్తుల లెక్కలో చేర్చడంతో దీని అంచనా విలువతో పాటు టాక్స్ కూడా భారీగా పెరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది బిడ్ లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆహ్వానించింది. తర్వాత ఈ బిల్డింగ్ తరితగతిన మార్చిన పాకిస్తాన్ అధికారిక వర్గం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే బిడ్డింగ్ ప్రక్రియను ఆపేసింది. ఒకపుడు క్లాస్ -2 హోదాలో ఉన్న ఈ భవనం తర్వాత క్లాస్-3 కి, ఇప్పుడు క్లాస్-4 స్థాయికి పడిపోయింది.

Exit mobile version